News November 23, 2024

మా సర్వే నిజమవుతుంది: యాక్సిస్ మై ఇండియా MD

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితంపై సర్వే సంస్థలు అంచనా వేసిన నంబర్లు తారుమారవుతున్నాయి. ఇక్కడ మహాయుతి 150, MVA 100+ సీట్లొస్తాయని చెప్పుకొచ్చాయి. కానీ, ఫలితాలు చూస్తుంటే మహా కూటమి 200+సీట్లు గెలిచేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా MD ప్రదీప్ గుప్తా తమ సర్వే రిజల్ట్స్‌ను రీట్వీట్ చేశారు. తమ అంచనా నిజమవుతుందని మరోసారి గుర్తుచేశారు. ప్రస్తుతం MHలో 225స్థానాల్లో ‘మహా’ ముందంజలో ఉంది.

Similar News

News January 23, 2026

‘బంగ్లాదేశ్ కథ ముగిసినట్లే’.. నిరాశలో క్రికెటర్లు

image

T20 WC నుంచి BAN వైదొలగడంపై ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. T20 కెప్టెన్‌ లిటన్‌ దాస్‌, టెస్ట్ కెప్టెన్ షాంటో టోర్నీలో ఆడేందుకు సిద్ధమని చెప్పినా, వారి మాటకు విలువ ఇవ్వలేదని సమాచారం. ‘బంగ్లా క్రికెట్‌ ముగిసినట్లే’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 23, 2026

VHP నేతపై దాడి.. ఉజ్జయినిలో చెలరేగిన హింస

image

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హింస చెలరేగింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగినట్టు తెలుస్తోంది. పలు బస్సులకు నిప్పుపెట్టిన అల్లరిమూకలు ఇళ్లపై రాళ్లతో దాడి చేశాయి. దీంతో ఉజ్జయినిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.

News January 23, 2026

తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ

image

తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కొత్త సర్కార్ లోడింగ్ అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో డీఎంకేకు కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పారు. DMK ప్రభుత్వం CMC (కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కారుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. వికసిత్ భారత్‌ ప్రయాణంలో తమిళనాడు పాత్ర కీలకమని చెన్నైలో నిర్వహించిన సభలో మోదీ స్పష్టం చేశారు.