News February 14, 2025
మాది MIGA మీది MAGA మన భాగస్వామ్యం MEGA: మోదీ

ప్రెసిడెంట్ ట్రంప్ తరచూ MAGA గురించి మాట్లాడతారని PM మోదీ అన్నారు. భారత్‌లో తాము ‘వికసిత్ భారత్’ దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. US కాంటెక్ట్స్‌లో దీనిని MIGAగా (Make India Grate Again) అనువదించుకోవచ్చన్నారు. ఇక భారత్, అమెరికాది MEGA పార్ట్‌నర్‌షిప్‌గా వర్ణించారు. అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో అద్భుతమైన మీటింగ్ జరిగిందని ట్వీట్ చేశారు. ఆయన్ను భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
Similar News
News November 10, 2025
6 గంటల్లోనే జీవ వ్యర్థాల నుంచి జీవ ఎరువుల తయారీ

జీవవ్యర్థ పదార్థాలను జీవ ఎరువులుగా మార్చే పరిశ్రమ త్వరలో HYDలోని ప్రొ.జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో.. వర్సిటీ ఒప్పందం చేసుకుంది. రూ.5 కోట్లతో ఈ ఎరువుల యూనిట్‌ను 2 నెలల్లోనే ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నారు. జీవవ్యర్థాల నుంచి 6 గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేయవచ్చని ‘బయోవే’ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
News November 10, 2025
విదేశాల్లో పిల్లలు.. కుమిలిపోతున్న తల్లిదండ్రులు!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం యువత విదేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. ప్రారంభంలో ఏడాదికోసారి పిల్లల వద్దకు ఉత్సాహంగా వెళ్లే తల్లిదండ్రులు వయసు పెరిగే కొద్దీ (60+) సుదీర్ఘ ప్రయాణాలు, ఆరోగ్య సమస్యల కారణంగా వెళ్లడం మానేస్తున్నారు. అయితే ఉద్యోగాలు, వీసా సమస్యలతో పిల్లలు కూడా ఇండియాకు రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతూ కుమిలిపోతున్నారు. చివరి రోజుల్లోనూ పిల్లల ప్రేమ పొందలేకపోతున్నారు.
News November 10, 2025
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 32 పోస్టులు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్(<


