News February 13, 2025

మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు: అచ్చెన్నాయుడు

image

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వల్లభనేని వంశీ బెదిరించడంతోనే ఇలా జరిగిందన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిదాడి చేయాలంటే 8 నెలల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Similar News

News January 9, 2026

సంక్రాంతి సినిమాలకు హైక్స్ లేనట్లే

image

TG: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశముంది. హైక్‌పై పలుమార్లు HC మండిపడటం, ఇకపై పెంచబోమని మంత్రి కోమటిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పడం తెలిసిందే. Rajasaabకు హైక్‌పై నేటి విచారణలో ‘మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇకపై మెమోలు ఇవ్వొద్దు’ అని HC తేల్చిచెప్పింది. దీంతో పండగకు వచ్చే ‘మన శంకర వరప్రసాద్, నారి నారి నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలకు పెంపు లేనట్లే.

News January 9, 2026

చంద్రుడిపైకి పారిపోయినా వదలను: మమతా బెనర్జీ

image

ED రెయిడ్స్ <<18797775>>సమయంలో<<>> తాను ఎలాంటి తప్పు చేయలేదని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం చివరికి కేంద్ర మంత్రి అమిత్ షాకే వెళ్తుందని ఆరోపించారు. కేంద్ర సంస్థలు ఒత్తిడి చేస్తే తాను అన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. కేంద్రంలో ఓడిన తర్వాత బీజేపీ నేతలు చంద్రుడిపైకి పారిపోయినా లాక్కొస్తానని కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో స్పష్టం చేశారు.

News January 9, 2026

ఆభరణాలు పెట్టుకుంటే అలర్జీ వస్తోందా?

image

నగలు పెట్టుకున్నపుడు కొందరికి చర్మంపై అలర్జీ వస్తుంటుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్‌ అంటారు. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, పొక్కులు వస్తుంటాయి. ఆర్టిఫిషియల్ ఆభరణాల్లో ఎక్కువగా వాడే నికెల్‌ లోహం దీనికి ప్రధాన కారణం. వీటిని వేసుకొనేముందు పౌడర్‌/ మాయిశ్చరైజర్‌ రాసుకుంటే మంచిది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, టైటానియం, 18 క్యారెట్‌ ఎల్లో గోల్డ్‌, స్టెర్లిన్‌ సిల్వర్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.