News October 13, 2025
RSS బ్యాన్ లెటర్‌పై దుమారం

బహిరంగ ప్రదేశాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలు నిషేధించాలని కర్ణాటక CM సిద్దరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. స్కూళ్లు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, మందిరాలు, పురాతన స్థలాలు తదితర చోట్ల RSS తమ శాఖలను నిర్వహిస్తోందని లేఖలో ప్రియాంక్ వివరించారు. సమాజంలో విభజనలు తీసుకొచ్చేలా ప్రచారం, నినాదాలు చేస్తోందని అభ్యంతరం తెలిపారు. అటు RSSను కాంగ్రెస్ ఏం చేయలేదని BJP మండిపడుతోంది.
Similar News
News October 13, 2025
దారుణం.. ఆరుగురు బాలురపై లైంగికదాడి

TG: హైదరాబాద్‌లోని సైదాబాద్ జువైనల్ హోమ్‌లో దారుణం జరిగింది. ఆరుగురు బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దసరాకు ఇంటికి వెళ్లిన సమయంలో ఓ బాలుడు జువైనల్ హోంకు తిరిగి వెళ్లనని కన్నీరు పెట్టగా తల్లి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. బాధితుడి తల్లి పోలీసులను ఆశ్రయించగా మరో ఐదుగురిపై ఇలాగే దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 13, 2025
మద్యం తాగే మహిళలకు తీవ్ర వ్యాధుల ముప్పు

మద్యం తాగే అలవాటు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మద్యం సేవించే మహిళలకు అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. స్త్రీల శారీరక నిర్మాణం పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మద్యం ఎక్కువగా సేవిస్తే క్యాన్సర్, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర వ్యాధులబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచిస్తున్నారు.
News October 13, 2025
రూ.2లక్షలకు చేరువలో కిలో వెండి

కిలో వెండి ధర రూ.2లక్షల వైపు దూసుకెళ్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కేజీపై ఏకంగా రూ.5వేలు పెరిగి రూ.1,95,000గా ఉంది. అటు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.320 పెరిగి రూ.1,24,540కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రేటు రూ.300 పెరిగి రూ.1,14,950 పలుకుతోంది.