News April 4, 2025
గచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తుల నిషేధం

TG: కంచ గచ్చిబౌలి భూములపై పోలీసులు కీలక ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 11, 2025
‘ఆస్కార్’కు రాజమౌళి ధన్యవాదాలు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో స్టంట్ డిజైన్ కేటగిరీని చేర్చడంపై డైరెక్టర్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ‘ఎట్టకేలకు వందేళ్ల నిరీక్షణ తర్వాత. 2027లో విడుదలయ్యే చిత్రాలకు ఆస్కార్ డిజైన్ కేటగిరీని చేర్చడం సంతోషం. దీనిని సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓ హారా & స్టంట్ కమ్యూనిటీకి, అకాడమీ సీఈవో బిల్ క్రామెర్‌కు ధన్యవాదాలు. ఈ ప్రకనటలో RRR యాక్షన్ విజువల్ వాడటం చూసి ఆనందించా’ అని తెలిపారు.
News April 11, 2025
BREAKING: రేపు ఇంటర్ రిజల్ట్స్

ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాలను అందరికంటే ముందుగా వే2న్యూస్‌లో పొందవచ్చు.
– వే2న్యూస్ యాప్‌లో వచ్చే స్పెషల్ స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ నొక్కితే చాలు. సెకన్లలో ఫలితాలు వస్తాయి. డౌన్లోడ్ అని మరొక్క క్లిక్ చేస్తే రిజల్ట్ కార్డ్ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.
News April 11, 2025
TGPSC కీలక నిర్ణయం

టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1నిష్పత్తిలో జరపనున్నట్లు వెల్లడించింది. అదనపు అభ్యర్థులను పిలవడం వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో పాటు పోటీదారులను ఆశకు గురిచేసినట్లు అవుతోందని కమిషన్ పేర్కొంది. కాగా ఇది వరకు మల్టీ జోనల్, జోనల్ పోస్టులకు 1:2, జిల్లా పోస్టులకు 1:3, దివ్యాంగుల కేటగిరీకి 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచేవారు.