News January 1, 2025

100కు పైగా కోర్సులు.. దరఖాస్తులు ఆహ్వానం

image

TG: నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో AI డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ సహా 100కు పైగా కోర్సుల్లో శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, PG, బీటెక్ చేసిన వారు ఈ నెల 9లోపు అప్లై చేసుకోవాలి. కోర్సులు పూర్తిచేసుకున్న వారికి దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రోగ్రామ్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమాన్ తెలిపారు.
వెబ్‌సైట్: <>www.nationalskillacademy.in<<>>

Similar News

News January 4, 2025

కోహ్లీది అదే కథ!

image

‘KOHLI LOVES SLIPS’ అన్న ట్రోల్స్‌ నిజం చేస్తూ BGT చివరి ఇన్నింగ్స్‌లోనూ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔట్ అయ్యారు. ఈ సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 8సార్లు కోహ్లీ ఇలాగే పెవిలియన్‌కు చేరడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకేలా ఔట్ అవుతున్నా ఆటశైలి మారకపోవడంతో రిటైర్ అవ్వాలనే డిమాండ్ విన్పిస్తోంది. కెరీర్ చివర్లో ఉన్న విరాట్ టెక్నిక్ మార్చుకోకపోతే టీంలో చోటు కోల్పోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

News January 4, 2025

ఏపీలో షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు: YCP

image

APలో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయంటూ వైసీపీ ట్వీట్ చేసింది. స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత నెల రోజుల వ్యవధిలోనే వందల నుంచి వేలాది రూపాయలకు బిల్లులు పెరిగిపోయాయని ఆరోపించింది. నెల్లూరు జిల్లాలో ఓ చిరుద్యోగి ఇంటికి రూ.39,525 బిల్లు వచ్చిందని ఓ ఫొటోను పంచుకుంది. బిల్లుల బాదుడే.. బాదుడు రూపంలో పేదలకు న్యూఇయర్ కానుక ఇస్తున్నావా? అని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసింది.

News January 4, 2025

కాసేపట్లో కోర్టుకు అల్లు అర్జున్

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. జడ్జి ముందు బన్నీ బెయిల్ పూచీకత్తు పత్రాలను సమర్పించనున్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులపై నిన్న బన్నీకి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.