News August 30, 2024

బంగ్లా అల్లర్లలో 1000 దాటిన మరణాలు

image

ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అల్లర్లలో మరణాల సంఖ్య 1000 దాటినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మరణించిన వారి కుటుంబ సభ్యుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో నిరసనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి పరిణామాలు షేక్ హసీనాను గద్దె దించేలా చేశాయి.

Similar News

News January 20, 2025

వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ

image

ఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ టీమ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. కదులుతున్న బైక్స్‌పై అత్యంత ఎత్తైన (20.4 ఫీట్) మానవ పిరమిడ్ నిర్మించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 7 బైక్‌లపై 40 మంది 2కి.మీ మేర ప్రయాణించడంతో ఈ ఘనతను అందుకుంది. ఆర్మీలోని మోటార్ సైకిల్ రైడర్ డిస్‌‌ప్లే టీమ్‌ను ‘డేర్ డెవిల్స్’ అని పిలుస్తారు.

News January 20, 2025

RGKarVerdict; గరిష్ఠ శిక్ష సరైనది: CBI

image

హత్యాచార దోషి సంజయ్‌కు ఉరిశిక్ష సరైనదని CBI లాయర్ వాదించారు. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ఠ శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లు న్యాయస్థానానికి విన్నవించారు. మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా తీర్పు ఉండాలన్నారు. పీజీ మెడిసిన్ చేస్తూ IPS కావాలనుకున్న యువతి జీవితం, కలలను సంజయ్ చెరిపేశాడని CBI లాయర్ వాదించారు.
– మధ్యాహ్నం గం.2:45కి సీల్దా కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News January 20, 2025

ట్రంప్ పార్టీ: నీతా అంబానీ కాంచీపురం పట్టుచీర స్పెషాలిటీ ఇదే!

image

డొనాల్డ్ ట్రంప్ ప్రైవేటు రిసెప్షన్‌లో నీతా అంబానీ కట్టుకున్న పట్టుచీరపై నెట్టింట చర్చ జరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత బీ కృష్ణమూర్తి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పురాణాల్లో కాంచీపురం మందిరాల ప్రాముఖ్యాన్ని శోధించి 100+ మోటిఫ్స్‌ డిజైన్ చేశారు. విష్ణువును ప్రతిబింబించేలా 2 తలల గరుడపక్షి, అమృతత్వం, దైవత్వానికి గుర్తుగా నెమళ్లను నేయించారు. దీనికి తోడుగా 18వ శతాబ్దపు వారసత్వ నగను నీతా ధరించారు.