News May 10, 2024
ఆరు రోజుల్లో $2 బిలియన్లకుపైనే వెనక్కి తీసుకున్నారు!

భారత స్టాక్ మార్కెట్లోని తమ షేర్లను విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఈనెల తొలి ఆరు సెషన్లలోనే ఏకంగా $2.4 బిలియన్లు (రూ.20వేలకోట్లకుపైనే) విలువైన షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తమవడమే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. మే 2, 3, 6, 7 తేదీల్లో రూ.6వేల కోట్లకుపైగా విలువైన షేర్లు విక్రయించగా, మే 8న రూ.6,669కోట్లు, మే 9న రూ.6,994కోట్ల షేర్లు విక్రయించారు.
Similar News
News January 3, 2026
సామాజిక రుగ్మతల తొలగింపునకు కృషి చేయాలి: కలెక్టర్

విద్యార్థులకు బోధనతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ బి.ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. శనివారం గద్వాల ఐడీఓసీలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్.. తొలి మహిళా ఉపాధ్యాయురాలి ఆశయాలను కొనసాగించాలని కోరారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News January 3, 2026
మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: ఉత్తమ్

TG: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇక గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే BRS ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తీసుకెళ్లేలా తమ ప్రాజెక్టును విస్తరించుకుందన్నారు. 34శాతం నీళ్లు చాలని కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పారు.
News January 3, 2026
గాలి జనార్దన్ రెడ్డి వివాదం.. SP ఆత్మహత్యాయత్నం

కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల BJP MLA గాలి జనార్దన్రెడ్డి, కాంగ్రెస్ MLA నారా భరత్రెడ్డి వర్గాల మధ్య <<18737485>>వివాదం<<>> తలెత్తింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యుడిని చేస్తూ బళ్లారి ఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు.


