News October 22, 2024

వచ్చే 20 ఏళ్లలో 200కు పైగా ఎయిర్‌పోర్టులు: రామ్మోహన్ నాయుడు

image

AP: వచ్చే 20 ఏళ్లలో దేశంలో 200కు పైగా ఎయిర్ పోర్టులు వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్-2024లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ఎయిర్ పోర్టుల సంఖ్య 74 నుంచి 157కి పెరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు ఐడియాలజీని అందుకోవడం తనకు కూడా కష్టంగా ఉందని చెప్పారు. విజన్ 2020తో పెను మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. HYDను ప్రపంచ స్థాయి నగరంగా మార్చారన్నారు.

Similar News

News October 22, 2024

వాట్సాప్‌తో ప్రభుత్వం ఒప్పందం

image

AP: కాస్ట్ సహా ఇతర స‌ర్టిఫికెట్లు, పౌర‌సేవ‌లు వాట్సాప్‌లో పొందేలా మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకుంది. కరెంట్, వాటర్, ఇంటి పన్ను, ఇతర బిల్లులు ఇకపై వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు. న‌కిలీలు, ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శ‌కంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్లు ఇవ్వనుంది. మెటా నుంచి టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నెన్స్, AI ద్వారా మ‌రిన్ని సిటిజెన్ స‌ర్వీసెస్ ఏపీ ప్ర‌భుత్వానికి అందించనుంది.

News October 22, 2024

రేవంత్‌ తిట్లను కేటీఆర్ తట్టుకోలేడు: జగ్గారెడ్డి

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దామగుండం రాడార్ స్టేషన్‌పై పిల్లచేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ తిడితే కేటీఆర్ తట్టుకోలేరన్నారు. ఆయనకు కష్టమంటే తెలియదని చెప్పుకొచ్చారు. రేవంత్ కష్టపడి ఎదిగారని, ప్రజల బాధలు ఆయనకు తెలుసన్నారు. కేసీఆర్ సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొని పైకి వచ్చారని జగ్గారెడ్డి అన్నారు.

News October 22, 2024

బ్రోకలీ తింటే ఏమవుతుంది?

image

మార్కెట్లో బ్రోకలీ కనిపించినా రెగ్యులర్‌ వంటకం కాదని చాలామంది చూసీచూడనట్లు వెళ్లిపోతుంటారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తరహాలోనే బ్రోకలీ కూడా క్రూసిఫరస్ ఆకుకూర. ఇందులో క్యాలీఫ్లవర్‌లో ఉన్న ‘క్యాన్సర్‌ను తగ్గించే’ లక్షణాలుంటాయి. బ్రోకలీ మొలకల్లో సల్ఫారఫేన్ ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ కారకం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో ఇది తీసుకున్నాక అసాధారణ మార్పు కన్పించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.