News April 5, 2024
యాపిల్‌లో 600 మందిపై వేటు

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ సంస్థ యాపిల్ 600 మంది ఉద్యోగులను తొలగించింది. కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు సమర్పించిన నివేదికలో కుపర్టినో అనే సంస్థ ఈ విషయం వెల్లడించింది. యాపిల్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్ప్లే ప్రాజెక్టులు నిలిచిపోవడమే ఈ ఉద్యోగాల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది. ఒక్క శాంటాక్లారాలోని యాపిల్ కారు సంబంధిత కార్యాలయం నుంచే 371 మందిని తొలగించినట్లు సమాచారం.
Similar News
News April 22, 2025
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్

AP: YCP నేత, MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మాజీ CM, ఆ పార్టీ అధినేత YS జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
News April 22, 2025
దిగజారుతున్న పంత్ ప్రదర్శన.. ఫ్యాన్స్ ఫైర్

IPL: LSG కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శన రోజురోజుకూ దిగజారుతోంది. ఇవాళ DC మ్యాచ్‌లో చివర్లో వచ్చి డకౌట్ కాగా, ఆ జట్టు ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇస్తే, ఇలాగేనా ఆడేది? అంటూ మండిపడుతున్నారు. పంత్ ఈ ఏడాది లీగ్‌లో 8 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధశతకం(63) చేశారు. రెండు సార్లు డకౌట్ అయ్యారు. కేవలం 13.25 యావరేజ్, 96.36 స్ట్రైక్‌రేట్‌తో పేలవంగా ఆడుతున్నారు.
News April 22, 2025
రేపు 39 మండలాల్లో తీవ్ర వడగాలులు

AP: రేపు రాష్ట్రంలోని 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం(7), విజయనగరం(17), మన్యం(13), అల్లూరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. సిద్ధవటం-43.8, కర్నూలు-43.5, వతలూరు-42.9, పెద్ద దోర్నాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.