News November 15, 2024

ప్రమాదంలో 80శాతానికి పైగా భారతీయుల ఆరోగ్యం: శాస్త్రవేత్త

image

పర్యావరణ మార్పు, కాలుష్యం కారణంగా భారత్‌లో 80శాతంమంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి సంబంధిత సమస్యల నుంచి మాతృత్వ సమస్యల వరకూ అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం ప్రభుత్వాల ప్రాధాన్యం కావాలి’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 15, 2024

సమగ్ర కుటుంబ సర్వేలో కవిత(PHOTOS)

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు ఇవాళ హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ సిబ్బందికి తమ పూర్తి వివరాలు ఇచ్చారు. కొన్ని వివరాలను కవితనే స్వయంగా నమోదు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటికొచ్చిన కవిత చాలారోజుల తర్వాత బయటి ప్రపంచానికి కనిపించారు.

News November 15, 2024

రైళ్లలో రీల్స్.. రైల్వే కీలక నిర్ణయం

image

రైళ్లు, రైల్వే స్టేషన్లు, కోచ్‌లలో రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దేశంలోని అన్ని రైల్వే జోన్లకు సూచించింది. కాగా కదులుతున్న రైళ్లలో, పట్టాల పక్కన ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతుండటంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

News November 15, 2024

అల్లు అర్జున్ ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేశారు: గుణశేఖర్

image

తాను కష్టాల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఆదుకున్నారని డైరెక్టర్ గుణశేఖర్ అన్‌స్టాపబుల్‌ షోలో వీడియో సందేశంలో తెలిపారు. ‘వరుడు సినిమాతో బన్నీకి నా వల్ల ఫ్లాప్ వచ్చింది. అయినా సరే రుద్రమదేవి సినిమా సమయంలో నాకు కాల్ చేశారు. ‘మీ సినిమా కష్టాల్లో ఉందని విన్నాను. నా వల్ల మీకు హెల్ప్ అవుతుందనుకుంటే ఏదైనా పాత్ర చేస్తాను’ అన్నారు. అడక్కుండానే ముందుకొచ్చి సాయం చేసిన మంచి మనిషి బన్నీ’ అని కొనియాడారు.