News October 10, 2025

కష్టాల కడలిని దాటి.. స్ఫూర్తిగా నిలిచి

image

పెళ్లి తర్వాత కలలను వదిలి ఇంటికే పరిమితం అవుతారు చాలామంది. కానీ హర్యానాకు చెందిన అంజూయాదవ్ పూర్తి విరుద్ధం. 21 ఏళ్లకే పెళ్లై, 22 ఏళ్లకే తల్లైంది అంజు. ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూ తల్లి సాయంతో టీచర్‌గా ఉద్యోగం సాధించింది. తర్వాత రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ప్రిపేర్ అవుతుండగా భర్త మరణించాడు. ఒంటరితల్లిగా కష్టపడిన ఆమె ఇప్పుడు RASలో DSPగా విధులు నిర్వర్తిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Similar News

News October 10, 2025

తొలి రోజు ముగిసిన ఆట

image

వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు భారత్ ఆట 318/2 వద్ద ముగిసింది. ఇవాళ మూడు సెషన్లలోనూ భారత్‌దే డామినెన్స్ కనిపించింది. జైస్వాల్ (173) డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తుండగా, సాయి సుదర్శన్ (87) సెంచరీ మిస్ చేసుకున్నారు. రాహుల్ 38 పరుగులు చేసి ఔటయ్యారు. క్రీజులో జైస్వాల్‌తో పాటు గిల్(20) ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లతో వారికన్ 2 వికెట్లు తీయగా, మిగిలిన వాళ్లంతా తేలిపోయారు.

News October 10, 2025

భారత గడ్డపై నుంచి పాక్‌కు అఫ్గాన్ వార్నింగ్

image

భారత పర్యటనలో ఉన్న అఫ్గాన్ తాలిబన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మా దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నాం. ఇలాంటి విధానాలతో ఇరుదేశాల మధ్య సమస్యలు పరిష్కారం కావు. అఫ్గాన్ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు’ అని హెచ్చరించారు. ఇక తమ నేల నుంచి ఇతర దేశాలపై దాడి చేసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వబోమని ముత్తాఖీ స్పష్టం చేశారు.

News October 10, 2025

APPLY NOW : చిత్తూరులో 56 ఉద్యోగాలు

image

AP: చిత్తూరు DHMO 56 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, MBBS, CA, Mcom, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.