News April 27, 2024

సమ్మర్‌లో చికెన్ అతిగా తింటున్నారా?

image

కొంతమంది చికెన్ అంటే కడుపు నిండా లాగిస్తారు. కానీ సమ్మర్‌లో చికెన్‌ను అతిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. రోజూ చికెన్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఒంట్లో హీట్ ఎక్కువై తలనొప్పి, కళ్ల మంటలు, బీపీ, డీహైడ్రేషన్, కండరాల నొప్పులు వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. వారానికి ఒక సారి తింటే ఫర్వాలేదని చెబుతున్నారు.

Similar News

News October 20, 2025

దీపావళి సమయంలోనే ఆలయానికి ఎంట్రీ

image

కర్ణాటకలోని చిక్కమగళూరులో కొండపై ఉన్న దేవిరామ్మ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్థానిక ఆచారం ప్రకారం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ ఏడాది నైట్ ట్రెక్కింగ్‌పై నిషేధం విధించి నిన్న, ఇవాళ దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలో నిన్న భక్తులు కొండను ఎక్కుతున్న సమయంలో డ్రోన్‌తో తీసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం.

News October 20, 2025

జూబ్లీహిల్స్‌లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.

News October 20, 2025

అక్టోబర్ 20: చరిత్రలో ఈరోజు

image

1937: హాస్యనటుడు రాజబాబు జననం(ఫొటోలో)
1962: భారత్-చైనా యుద్ధం మొదలు
1978: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం(ఫొటోలో)
1990: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకర్ రావు మరణం
2008: దర్శకుడు సి.వి. శ్రీధర్ మరణం
2011: నటుడు, గాయకుడు అమరపు సత్యనారాయణ మరణం
➢ప్రపంచ గణాంక దినోత్సవం