News February 17, 2025
IND-PAK మ్యాచ్‌పై ఓవర్‌హైప్: హర్భజన్

ఛాంపియన్స్ ట్రోఫీలో మిగతా అన్ని మ్యాచుల్లాగానే IND-PAK పోరు ఉంటుందని హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఈ మ్యాచ్‌పై ఓవర్‌హైప్ నెలకొందని తెలిపారు. ‘భారత్ పటిష్ఠమైన జట్టు. పాకిస్థాన్ నిలకడలేమితో ఉంది. ఐసీసీ టోర్నీల్లో రెండు టీమ్‌ల నంబర్లను పోల్చి చూస్తే మీకే అర్థమవుతుంది’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల సొంత గడ్డపై జరిగిన ట్రైసిరీస్(PAK-NZ-SA)లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News November 23, 2025
భద్రకాళి అమ్మవారికి పూజలు

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.
News November 23, 2025
భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.
News November 23, 2025
PNBలో 750 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్‌డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. 20-30 ఏళ్ల మధ్య ఉన్న గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. https://pnb.bank.in/


