News August 10, 2024
మీరు చూపిన ప్రేమకు పొంగిపోయా.. థాంక్స్: మహేశ్‌బాబు

నిన్న తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పినవారికి మహేశ్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు చూపిన ప్రేమ, పంపిన మెసేజ్‌లు, ఆశీర్వాదాలకు నేను ఎంతో పొంగిపోయాను. నా బర్త్‌డేను మీరంతా ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మార్చారు. ఎల్లప్పుడూ మీరు నాకు ఇచ్చే మద్దతు, చూపే ప్రేమకు కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 17, 2025
స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్(NMMSS-2026)కు దరఖాస్తు చేసేందుకు రేపే చివరి తేది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు రేపటి లోగా ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించాలి. OCT 22లోగా ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్‌ను సంబంధిత పాఠశాల HMలు DEOలకు పంపించాల్సి ఉంటుంది. ఈ స్కీం ద్వారా ఆర్థికంగా వెనకబడిన మెరిట్ స్టూడెంట్స్‌కు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ అందజేస్తారు.
News October 17, 2025
చరిత్రలో తొలిసారి.. అరుణిమకు అరుదైన గౌరవం

ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి అరుణిమ కుమార్‌కు యూకేలో అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ రాజు ఛార్లెస్-3 ఆమెను ‘బ్రిటిష్ ఎంపైర్ మెడల్’తో సత్కరించారు. కూచిపూడి నర్తకి ఈ గౌరవం పొందడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది భారతీయ నాట్యానికి దక్కిన గుర్తింపు అని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో పుట్టిన అరుణిమ ప్రస్తుతం యూకేలో నివాసం ఉంటున్నారు. తన డాన్స్ అకాడమీ ద్వారా ఇప్పటిదాకా 50+ దేశాల్లో 3వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.
News October 17, 2025
ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి: HC

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చెప్పాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వం, ఈసీ న్యాయస్థానాన్ని కోరగా హైకోర్టు ఇందుకు అంగీకరించింది. కాగా జీవో 9తో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ HCలో పిటిషన్లు దాఖలవగా జీవోపై స్టే ఇవ్వడం తెలిసిందే.