News March 17, 2024

ప.గో: వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్.. 3Hrs టెన్షన్

image

ప.గో జిల్లా తణుకు మండలం పైడిపర్రులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి ఎట్టకేలకు కిందికి దిగాడు. వేల్పూరు గ్రామానికి చెందిన యరమాటి సత్యనారాయణ ఆదివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సత్యనారాయణను కిందకు దించే ప్రయత్నం చేశారు. దాదాపు 3గంటల అనంతరం అతడు కిందికి దిగాడు.

Similar News

News February 3, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలపై  డీఆర్వో సమీక్ష

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్‌ను రాజకీయ పార్టీలు తప్పక పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. భీమవరం కలెక్టరేట్‌లో డిఆర్ఓ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై తూర్పు, ప. గో.జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, మోడల్ కోడ్ గురించి వివరించారు. జిల్లాలో 69,884 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నారన్నారు.

News February 2, 2025

నూతన డీజీపీని కలిసిన ప.గో ఎస్పీ

image

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనను ప.గో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీకి పూల మొక్క అందజేశారు. అనంతరం జిల్లాలోని లా అండ్ ఆర్డర్‌ గురించి డీజీపీకి వివరించారు.

News February 2, 2025

ప.గో. ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పించిన జెసీ

image

భీమవరం పట్టణంలోని పలు షాపులలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ షాపుల యజమానులకు ప్లాస్టిక్ వాడకంపై కలిగే నష్టాలను వివరించారు. పేపర్ కవర్లను, గుడ్డ సంచులను వాడే విధంగా అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి  పాల్గొన్నారు.