News March 17, 2024
ప.గో. జిల్లాలో ఇరువురు మహిళలకు అవకాశం

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో YCP నుంచి ఇరువురు మహిళలకు అవకాశం దక్కింది. వీరిలో తెల్లం రాజ్యలక్ష్మి (పోలవరం), తానేటి వనిత (గోపాలపురం) ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఒకరికి అవకాశం లభించగా, ఈసారి అదనంగా మరొకరికి చోటు దక్కింది. కాగా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ నుంచి గూడూరి ఉమాబాలకు అవకాశం లభించింది. ఏలూరు జిల్లాలో పార్లమెంటు మహిళలకు స్థానం దక్కలేదు.
Similar News
News December 4, 2025
పాలకొల్లు: మహిళ హత్య కేసులో..నిందితుడు అరెస్టు

పాలకొల్లులో ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు..పాలకొల్లు టిడ్కో ఇంటిని అద్దె తీసుకుని రాధ అనే మహిళతో సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో రాధతో గొడవ పడి టిట్కో భవనం మేడపైకి తీసుకెళ్లి..తోసేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కుమారై భవ్యశ్రీ ఫిర్యాదుతో సుధాకర్ను అరెస్టు చేశామని ఎస్సై పృథ్వీ తెలిపారు.
News December 3, 2025
పెనుమంట్రలో ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని రైతులు RSKలను ధాన్యం అమ్మకాలకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని మార్టేరు బ్రాహ్మణచెరువు ప్రధాన రహదారిపై నిల్వ చేసిన ధాన్యం రాశులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. అనంతరం కొద్దిసమయం రైతులతో మాట్లాడారు.
News December 3, 2025
పశ్చిమలో ‘కొబ్బరి’కి కొత్త కళ..

ప.గో జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్ పరిధిలో రూ.29.97 కోట్ల అంచనాతో చేపట్టనున్న అత్యాధునిక ‘కామన్ ఫెసిలిటీ సెంటర్’ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వాటా రూ.4.49 కోట్లలో.. తొలివిడతగా రూ.2.24 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కేంద్రం ద్వారా కొబ్బరి, బంగారం ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలు సాధించేందుకు మార్గం సుగమమైంది.


