News September 16, 2024
కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి.కృష్ణయ్య

AP: నామినేటెడ్ పదవుల భర్తీని NDA కూటమి ప్రారంభించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి.కృష్ణయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ IAS అయిన కృష్ణయ్య మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో APIIC ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
Similar News
News December 29, 2025
రాష్ట్రంలో 66 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News December 29, 2025
దేవుడు కలలో కనిపిస్తే..?

దైవం కలలో కనిపించడం శుభానికి సంకేతమని పండితులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు దైవం కలలోకి వస్తే సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. ‘మొక్కులు మరిచిపోయినప్పుడు గుర్తుచేయడానికి, నిర్ణయాలు తీసుకోవడంలో సతమతమవుతున్నప్పుడు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన మన కలలో కనిపిస్తుంటాడు. ఆశీస్సులు ఇవ్వడానికి కూడా వస్తుంటాడు. అలా వస్తే.. ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారని అర్థం’ అని సూచిస్తున్నారు.
News December 29, 2025
భిక్షమెత్తుతూ ఆలయానికి రూ.లక్ష, అన్నదానం

AP: సేవాగుణానికి చేసే పనితో సంబంధం ఉండదని నిరూపిస్తున్నారు గొర్ర నరసయ్యమ్మ(70). తిరుపతికి చెందిన ఆమె 42 ఏళ్ల క్రితం తునికి వచ్చారు. స్థానికంగా అమ్మవారి ఆలయం వద్ద యాచకురాలిగా జీవనం సాగిస్తున్నారు. సొంతవారు వదిలేయడంతో తన సంపాదనలో కొంత అన్నదానానికి బియ్యం బస్తాలు ఇవ్వడమే కాకుండా ₹లక్షను అమ్మవారి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. దీంతో భిక్షమెత్తుతూ ఆమె చేస్తున్న సేవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


