News March 19, 2025
P4పై తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం

పేదరిక నిర్మూలన కోసం తలపెట్టిన P4 పాలసీ(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్ షిప్)ని ఈ నెల 30 న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని కలెక్టర్ వేంకటేశ్వర్ తెలిపారు మేధావులు, ఎన్జీఓలు, సామాజిక సేవకులు పాల్గొనాలని కోరారు. అట్టడుగున ఉన్న 20 శాతం మంది ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
Similar News
News November 23, 2025
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని మంత్రికి వినతి

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హుస్నాబాద్ డివిజన్ రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. రెండేళ్లుగా బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, బకాయిలు విడుదలయ్యేలా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
News November 23, 2025
వాన్ Vs వసీం.. ఈసారి షారుఖ్ మూవీ పోస్టర్‌తో!

యాషెస్ తొలి టెస్టులో ENG ఓటమితో ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేశారు. మ్యాచ్ 2వ రోజు ENG ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ చెప్పారు. కానీ హెడ్ చెలరేగడంతో AUS గెలిచింది. దీంతో వసీం ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ ఫొటో పోస్ట్ చేసి ‘Hope you’re okay @michaelvaughan’ అని పేర్కొన్నారు. గతంలోనూ IND, ENG మ్యాచుల సందర్భంలో పుష్ప, జవాన్ మీమ్స్‌తో వసీం ట్రోల్ చేశారు.
News November 23, 2025
పిల్లల్లో ఆటిజం ఉందా? ఇలా చేయండి

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.


