News March 19, 2025

P4పై తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం

image

పేదరిక నిర్మూలన కోసం తలపెట్టిన P4 పాలసీ(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌ షిప్)ని ఈ నెల 30 న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని కలెక్టర్ వేంకటేశ్వర్ తెలిపారు మేధావులు, ఎన్జీఓలు, సామాజిక సేవకులు పాల్గొనాలని కోరారు. అట్టడుగున ఉన్న 20 శాతం మంది ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.

Similar News

News March 19, 2025

హాస్టల్‌లో మెరుగైన సౌకర్యాలు ఉండాలి: హనుమకొండ కలెక్టర్

image

హాస్టల్‌లో విద్యార్థులకు సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ నయీమ్ నగర్‌లోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు?, సౌకర్యాలు ఎలా ఉన్నాయని బీసీ సంక్షేమ అధికారి రామ్ రెడ్డి, హాస్టల్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

News March 19, 2025

గుంటూరు: వక్కపొడి సంస్థ కార్యాలయాలపై దాడులు 

image

గుంటూరులోని ఓ ప్రముఖ వక్కపొడి సంస్థ కార్యాలయాలపై నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం కూడా ఐటీ దాడులు కొనసాగాయి. గుంటూరులోని ఆ సంస్థ ఛైర్మన్ నివాసంలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో 40కిలోల బంగారం, 100 కిలోల వెండి, రూ.18లక్షల నగదు సీజ్ చేసినట్టు సమాచారం. వక్కపొడి ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. 

News March 19, 2025

MHBD: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ 2023 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల సందర్భంగా కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఇద్దరికీ మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. అదేవిధంగా ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలకు మైకులు డీజేలతో ఊరేగింపులు ధర్నాలు, ప్రచారాలు నిర్వహించొద్దని పేర్కొన్నారు.

error: Content is protected !!