News February 5, 2025

ఉగాది నుంచి P4: సీఎం చంద్రబాబు

image

AP: పేదరిక నిర్మూలనకు ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఉగాది నుంచి P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్‌షిప్) విధానాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా టాప్‌లో ఉన్న 10% మంది 20% మంది పేదలకు చేయూతనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పారిశ్రామివేత్తలు, NRIలు, ఇతర ధనవంతులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

Similar News

News February 5, 2025

ప్రభాస్ సినిమాలో సాయిపల్లవి?

image

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో డార్లింగ్ ప్రేయసి పాత్ర కోసం సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఆ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News February 5, 2025

డీప్‌సీక్‌ను బ్యాన్ చేసిన ఆస్ట్రేలియా

image

ఏఐ రంగంలో ప్రపంచాన్ని షేక్ చేస్తున్న చైనా డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది. ఆ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ అఫైర్స్ సెక్రటరీ స్టెఫానీ తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు, మొబైల్ పరికరాల్లో డీప్‌సీక్‌ ఉత్పత్తులను నిషేధించాలని అధికారులను ఆదేశించారు. సౌత్ కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ కూడా డీప్‌సీక్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News February 5, 2025

నేడే ఢిల్లీ పోలింగ్.. సర్వం సిద్ధం

image

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. వరుసగా మూడో సారి గెలవాలని ఆప్, 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావాలని బీజేపీ, పునర్వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 35వేల మంది పోలీసులు, 15వేల మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.

error: Content is protected !!