News February 14, 2025
PAపల్లి: రిజర్వాయర్లో కోళ్లు.. పోలీసుల అదుపులో అనుమానితుడు..?

పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి రిజర్వాయర్లో కోళ్ల కళేబరాలు బయటపడడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఇవాళ వే2న్యూస్లో వార్త పబ్లిష్ కావడంతో అలర్ట్ అయిన అధికారులు.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో దేవరకొండ ఆర్డీఓ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. జాలర్లతో కోళ్ల కళేబరాలను బయటకు తీయించారు. కాగా, ఇందుకు బాధ్యుడైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News December 5, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలులో వేగంపై కమిషనర్ ఆదేశాలు

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో పారదర్శకత, వేగం పెంచాలని గురువారం రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. కొనుగోలు కేంద్రాలు, పేమెంట్ జాప్యం, సీఎంఆర్ సరఫరా, రవాణా వ్యవస్థపై సమీక్ష చేసి, పూర్తి డిజిటలైజేషన్తో ట్యాబ్ ద్వారా తేమ, తూకం, రైతు రిజిస్ట్రేషన్ వివరాలు పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ కావాలని ఆదేశించారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. నల్గొండ జిల్లా వ్యయ పరిశీలకుడిగా ఆదిత్య

నల్గొండ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎస్.వెంకట్ ఆదిత్యను జిల్లా వ్యయ పరిశీలకుడిగా గురువారం నియమించారు. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ, అభ్యర్థుల ఖర్చుల నమోదు, అక్రమ ఖర్చుల నియంత్రణపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తారని అధికారులు తెలిపారు.
News December 5, 2025
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న నల్గొండ కలెక్టర్

ఎస్ఈసీ కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని జిల్లాలో చేసిన ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. పోటీ లేకుండా జరిగే గ్రామ పంచాయతీల్లో కూడా కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.


