News November 21, 2024

PAC ఛైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్.!

image

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన వచ్చినట్లు సమాచారం. కాగా ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రతిపక్ష హోదా ఉంటేనే ఇందుకు అర్హులని టీడీపీ వాదిస్తోంది.

Similar News

News March 13, 2026

పూతలపట్టు: పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయిన దొంగ

image

పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఓ బైక్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. రంగంపేట క్రాస్‌కు చెందిన హరిబాబు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసి తీసుకెళ్లాడు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. పెట్రోల్ అయిపోవడంతో ఆ దొంగ బైక్‌ను తోసుకుంటూ పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నట్లు తెలిసింది. వెంటనే స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.

News March 13, 2026

ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

image

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.

News March 13, 2026

యుద్ధం.. చిత్తూరు జిల్లాలో నూనె ధరల పెంపు

image

యుద్ధం ప్రభావంతో వంటనూనెల ధరలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లాలో బ్రాండెడ్ నూనెలు కిలో ప్యాకెట్‌పై రూ.10 పెంచారు. లూజ్ విక్రయాల్లోనూ లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారని తెలుస్తోంది. జనవరిలో సన్ ఫ్లవర్ ఆయిల్ రిటైల్ ధర రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.170 నుంచి రూ.175కు చేరింది. పామోలిన్ రూ.110 నుంచి రూ.130కి.. వేరుశనగ నూనె రూ.160 నుంచి రూ.175కు పెరిగింది.