News December 2, 2024
‘హై-రిస్క్ ఫుడ్ కేటగిరీ’గా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్!

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ను ‘హై-రిస్క్ ఫుడ్ కేటగిరీ’గా వర్గీకరించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్ణయించింది. దీంతో వీటిని తయారు చేసే కంపెనీలను గుర్తింపుపొందిన థర్డ్ పార్టీ ఏజెన్సీలు ప్రతి ఏటా ఓసారి తనిఖీ చేసి ప్రమాద ఆధారిత ఆడిట్ చేయనున్నాయి. లైసెన్స్ /రిజిస్ట్రేషన్ కోసమూ అధికారులు తనిఖీ చేస్తారు. వినియోగదారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా FSSAI చర్యలు చేపట్టింది.
Similar News
News November 14, 2025
యూఏఈపై భారత్-ఎ విజయం

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ <<18287840>>టోర్నీలో<<>> భారత్-ఎ బోణీ కొట్టింది. UAEతో జరిగిన తొలి టీ20లో 148 రన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొండంత లక్ష్యం(298)తో బరిలోకి దిగిన యూఏఈ 149 రన్స్కే పరిమితమైంది. ఆ జట్టులో సోహైబ్ ఖాన్(63) ఒక్కడే పోరాడారు. ఇండియన్ బౌలర్లలో గుర్జప్నీత్ 3, హర్ష్ దూబే 2 వికెట్లు తీశారు. భారత్ తన తర్వాతి మ్యాచులో పాకిస్థాన్-ఎతో ఈనెల 16న తలపడనుంది.
News November 14, 2025
ఏపీ ఉక్కురంగంలో జపాన్ పెట్టుబడులు: ఓనో కేయిచ్చి

AP: విశాఖ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న జపాన్ రాయబారి ఓనో కేయిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం కావాలని CM కోరారు. CII సమ్మిట్లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
News November 14, 2025
ఈ నెల 19న రైతుల ఖాతాల్లో PM కిసాన్ డబ్బులు

PM కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న PM మోదీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ <


