News August 30, 2025
PACS ద్వారా యూరియా సరఫరాకు చర్యలు: కలెక్టర్

పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియాను సక్రమంగా అందజేయడానికి PACS ద్వారా సరఫరాకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కూసుమంచిలోని రైతు వేదికలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని ప్యాక్స్ ద్వారా యూరియా సరఫరాపై ఆయన వ్యవసాయ శాఖ అధికారులు, ప్యాక్స్ డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. యూరియా పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News August 31, 2025
ఖమ్మం: స్థానిక పోరుకు సమాయత్తం

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 571 పంచాయతీల్లో 5,214 వార్డులు, అదే సంఖ్యలో పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,572 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు 10,330 మంది అవసరమని తేల్చారు.
News August 31, 2025
అన్నదాతను ముంచిన వర్షం

భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో 3,644 ఎకరాల మేర పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 33% పైగా 2,893 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని గుర్తించారు. వరి 1,950 ఎకరాలు, పత్తి 330, పెసర 613 ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు. అత్యధికంగా కూసుమంచి మండలంలో 1,875 ఎకరాల్లో వరి, 320 పత్తి, పెసర 160 ఎకరాల పంటను రైతులు నష్టపోయారు.
News August 31, 2025
ఖమ్మం: ‘3 నుంచి PACS ద్వారా యూరియా పంపిణీ’

పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియా పంపిణీ PACS కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారానే జరుగుతుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. సెప్టెంబర్ 3 నుంచి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి 2500 ఎకరాలకు ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేసి, వ్యవసాయ అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించినట్టు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.