News March 2, 2025

‘వెలిగొండ’ కోసం త్వరలో పాదయాత్ర: తాటిపర్తి

image

AP: సాగు, తాగు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై కూటమి ప్రభుత్వం పగ పట్టిందని YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీకి నిధులు కేటాయించకుండా మంత్రి నిమ్మల మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే వెలిగొండ కోసం పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని, విషం చిమ్మే నేత అని ఘాటు విమర్శలు చేశారు.

Similar News

News February 6, 2026

ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

image

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)

News February 6, 2026

ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజాసాబ్’

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. గత నెల 9న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

News February 6, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.