News March 17, 2024
పాడేరు: మోదకొండమ్మ జాతరకు తేదీలు ఖరారు

మన్యం ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించడానికి ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్ళి సింహాచలం నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగుళ్ళి ఉషారాణి అధ్యక్షతన ఆదివారం అమ్మవారి ఆలయంలో పురోహితులు సుబ్రహ్మణ్యశాస్త్రి ఆయా తేదీలను నిర్ణయించారు. త్వరలో ఉత్సవ కమిటీ వేయనున్నారు.
Similar News
News December 15, 2025
గాజువాకలో యువతి ఆత్మహత్య

గాజువాకలోని జింక్ గేటు ఎదురుగా గల 59వ వార్డ్లోని హిమచల్ నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న గిడుతూరు సాయి కుమారి (23) తన ఇంట్లో ఆదివారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు గమనించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గాజువాక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి మృతికి గల కారణాలు తెలియల్సి ఉంది.
News December 15, 2025
నేడు GVMCలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

విశాఖలోని GVMC ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్ వంటి సమస్యలపై ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.
News December 14, 2025
విశాఖ: ఆర్టీసీలో నెల రోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు

ఆర్టీసీలో నెలరోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 20 నుంచి జనవరి 19వ తేదీ వరకు 48 గంటల్లోనే కస్టమర్లకు పార్సెల్ డెలివరీ చేస్తామన్నారు. విశాఖలో 84 కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తక్కువ రేట్లకే కస్టమర్ వద్దకు పార్సెల్స్ చేరుతాయని, ఆర్టీసీకి అదనంగా ఆదాయం చేకూర్చే విధంగా సిబ్బందితో కార్గోపై ప్రచారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


