News March 31, 2025
సరైన సమయంలోనే పద్మభూషణ్: బాలకృష్ణ

సరైన సమయంలో కేంద్రం తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందని హీరో బాలకృష్ణ అన్నారు. ఆలస్యంగా పురస్కారం వచ్చిందనే విషయమై ఆయన స్పందించారు. ఆదిత్య 369 వంటి సినిమాలు ఏ జనరేషన్కైనా నచ్చుతాయని చెప్పారు. ఇలాంటి సినిమాలు చేయాలని చాలా మంది ప్రయత్నించినా ఈ స్థాయిలో సక్సెస్ అవ్వలేదన్నారు. ఏప్రిల్ 4న ఈ మూవీ రీరిలీజ్ కానుంది.
Similar News
News January 20, 2026
వివేకా హత్య కేసును లాజికల్ ఎండ్కు తీసుకెళ్లాలి: SC

వివేకానందరెడ్డి హత్యపై మళ్లీ మినీ ట్రయల్ కొనసాగిస్తే కేసు తేలడానికి మరో పదేళ్లు పడుతుందని SC వ్యాఖ్యానించింది. సునీత దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారించింది. కేసును లాజికల్ ఎండ్కు తీసుకెళ్లాల్సిన అవసరముందని పేర్కొంది. పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దాని వైఖరిని అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేసును ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
News January 20, 2026
గ్రీన్లాండ్ గడ్డపై అమెరికా జెండా.. ట్రంప్ పోస్ట్ వైరల్!

ట్రంప్ SMలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్లాండ్లో ట్రంప్ అమెరికా జెండా పాతినట్లు, దాని పక్కనే బోర్డుపై ‘గ్రీన్లాండ్-US భూభాగం 2026’ అని ఉన్న AI ఇమేజ్ షేర్ చేశారు. ఇప్పటికే పిటుఫిక్ స్పేస్ బేస్కు US తన యుద్ధ విమానాలను పంపడం, దానికి ప్రతిగా డెన్మార్క్ భారీగా సైన్యాన్ని మోహరించడంతో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
News January 20, 2026
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


