News October 7, 2024

బీజేపీలో చేరిన పద్మశ్రీ గ్రహీత

image

పద్మశ్రీ అవార్డు గ్రహీత, గిరిజన కళాకారిణి దుర్గాభాయ్ బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ విధానాలకు ఆకర్షితురాలై ఆమె కాషాయ పార్టీలో చేరినట్లు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. స్వయంగా దుర్గాభాయ్ ఇంటికి వెళ్లిన సీఎం ఆమెకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. కాగా దుర్గాభాయ్ 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

Similar News

News April 1, 2026

AIతో జాబ్ పోయిందని భర్త ఆత్మహత్య.. 18వ ఫ్లోర్ నుంచి దూకేసిన భార్య

image

బెంగళూరులో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన భానుచందర్ రెడ్డి AI కారణంగా గతేడాది ఉద్యోగం కోల్పోవడంతో అమెరికా నుంచి వచ్చేశారు. భార్య షాజియాతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. జాబ్ పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయన సోమవారం ఉరేసుకున్నాడు. అది తట్టుకోలేని భార్య 20 నిమిషాల్లోనే 18వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

News April 1, 2026

యంగ్ హీరోలతో బాలయ్య పోటీ.. మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

image

బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తుండగా, ఆ తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరాకు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విజయ్ కనకమేడల చెప్పిన కథకూ బాలయ్య ఓకే చెప్పినట్లు సమాచారం. ఇది 2027 ఆరంభంలో పట్టాలెక్కనుందని టాక్. నాంది, భైరవం, ఉగ్రం చిత్రాలకు విజయ్ డైరెక్షన్ చేశారు.

News April 1, 2026

GK: భారతీయ రైల్వే – కీలక విషయాలు

image

*మొదటి రైలు: భారతదేశంలో మొదటి రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై (బోరి బందర్) నుంచి థానే వరకు (34 కి.మీ) నడిచింది.
*రైల్వే జోన్లు: ప్రస్తుతం 19 రైల్వే జోన్లు ఉన్నాయి (మెట్రో రైల్ కోల్‌కతాతో కలిపి).
*అతి పొడవైన రైలు మార్గం: వివేక్ ఎక్స్‌ప్రెస్ – ఇది దిబ్రూగఢ్ (అస్సాం) నుండి కన్యాకుమారి (తమిళనాడు) వరకు ప్రయాణిస్తుంది.
*మొదటి విద్యుత్ రైలు: 1925లో ముంబై నుండి కుర్లా మధ్య నడిచిన డెక్కన్ క్వీన్.