India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ నమోదైన మనీలాండరింగ్ కేసులో <<17013741>>29 మంది సెలబ్రిటీ<<>>లకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ నిర్వహకులతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కాపీలను ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యాడ్ ఏజెన్సీలు, బెట్టింగ్ యాప్ యజమానులు, విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, శ్యామల, శ్రీముఖి, అనన్య నాగళ్లతో సహా ఇతరులను విచారించనుంది.
TG: రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. రామ్‌చందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు.
AP: జనాభా పెరుగుదలను ప్రోత్సహించేలా త్వరలోనే మంచి పాలసీ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జనాభా పెంచుకునేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించిందని, ఎక్కువ జనాభా ఉండటం మన దేశానికి పెద్ద వనరు అవుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు పెంచేందుకు తాము ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
తనకు పెళ్లి అంటే భయమని, అందుకే వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. పెళ్లి పట్ల భయం ఉన్నప్పటికీ, తల్లిగా మారాలనే ఆశ ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కొందరు యువతులు పెళ్లి చేసుకుని స్వేచ్ఛను కోల్పోతున్నారు. కానీ ఇది నాకు అస్సలు నచ్చదు. ప్రేమలో ఉండటం మాత్రం నాకు నచ్చుతుంది. ప్రస్తుతం నేను సింగిల్‌గా హ్యాపీగానే ఉన్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
TG: దళితులు, ఆదివాసీలు అంటే బీజేపీకి గౌరవం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి ఆ పార్టీలో ప్రమోషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. దళితులు, ఆదివాసీలను వ్యతిరేకించే రాంచందర్‌రావును BJP చీఫ్‌గా చేశారని విమర్శించారు. సుశీల్ కుమార్‌ను ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా నియమించారని విమర్శించారు.
వన్డే కెప్టెన్సీ నుంచి <<17027965>>రోహిత్ శర్మను<<>> తప్పిస్తారని వార్తలు వస్తుండటంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దేశం కోసం ఓ ODI వరల్డ్ కప్ గెలవాలని ఉందని రోహిత్ గతంలో చెప్పారు. ఈ సిక్స్ హిట్టర్ 24 ఐసీసీ వైట్ బాల్ మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 23 మ్యాచుల్లో భారత్ గెలిచిందని, సగటు 54గా ఉందంటున్నారు. వచ్చే 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ కంటిన్యూ అవ్వాల్సిందేనని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
AP: జనాభాను పెంచడాన్ని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ‘ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రస్తుతం యువత ఇష్టపడట్లేదు. ఖర్చులు పెరగడం, సరైన ఆదాయం లేకపోవడమే ఈ సమస్యకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదల అవసరం. ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయి’ అని ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో CM అన్నారు.
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC)లో 361 అప్రెంటిస్(ఏడాది కాలవ్యవధి)ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 11 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయోపరిమితి గరిష్ఠంగా 30 ఏళ్లు కాగా రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. స్టైఫండ్ గరిష్ఠంగా రూ.15వేలు అందించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ <
TG: భద్రాచలం ఆలయ భూముల <<16992146>>కబ్జాపై <<>> BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో స్పందించారు. ‘రాములోరి భూములను ఆక్రమిస్తుంటే మాట్లాడరేం? మీ భాగస్వామి ప్రభుత్వం(AP) చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక ఈసారి భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా? ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను ప్రజలు గమనిస్తున్నారు. మోదీతో మాట్లాడతారో, మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం. భద్రాద్రిని కాపాడండి’ అని కోరారు.
భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర సగటున రూ.100 ఉంది. అత్యధిక చమురు నిల్వలు ఉన్న ఇరాన్, వెనిజులా దేశాల్లో చాలా తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తోంది. లీటర్ పెట్రోల్ ధర ఇరాన్‌లో రూ.2.4 ఉండగా వెనుజులాలో ₹3.06గా ఉంది. ఇండియాలో పెట్రోల్‌పై కేంద్రం ₹19.90, రాష్ట్రం 30-35% వరకు పన్ను(ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది) వసూలు చేస్తున్నాయి. అండమాన్‌లో దేశంలోనే తక్కువ ధరకు పెట్రోల్(రూ.82.42) లభిస్తోంది.
Sorry, no posts matched your criteria.