India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ తరం మొత్తాన్ని ఆకట్టుకున్న యమహా RX 100 మళ్లీ మార్కెట్లోకి రానుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో లాంచ్ కావొచ్చని అంచనా. రూ.1.40లక్షల నుంచి రూ.1.50లక్షల మధ్యలో ధర ఉండొచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి. 100 CC సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, 5 స్పీడ్ గేర్ బాక్స్, 70 కి.మీ మైలేజీ దీని ప్రత్యేకతలుగా తెలుస్తోంది. డిజైన్ విషయంలో పాత స్టైల్‌నే అనుసరించినట్లు సమాచారం.
చాలామంది మహిళలు రుతుక్రమం సరిగ్గాలేక ఇబ్బందులు పడుతుంటారు. అధికంగా జింక్ తీసుకోవడమే దీనిక్కారణం కావొచ్చని పుణే వైద్యురాలు సునీత తాండూల్‌వాడ్కర్ పేర్కొన్నారు. ‘ఆరోగ్యానికి జింక్ అవసరమే. కానీ దాని స్థాయులు ఎక్కువైనప్పుడు ఒంట్లోకి ఇతర మినరల్స్‌ని రానివ్వదు. అండం విడుదలను, రుతుక్రమాన్ని అస్థిరపరుస్తుంది. రోజుకు 14 మిల్లీగ్రాములకు మించి జింక్ శరీరానికి అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో పోలింగ్ ముగిసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 58శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWS యాప్‌లో చూడండి.
మహారాష్ట్ర <<14658660>>‘బిట్‌కాయిన్ స్కామ్<<>>’ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని గౌరవ్ మెహతా ఇళ్లు, ఆఫీసుల్లో ED, CBI సోదాలు నిర్వహించినట్టు సమాచారం. అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మాజీ IPS అధికారి బయటపెట్టిన వీడియోలో NCP SP చీఫ్ శరద్ పవార్ కుమార్తె, సుప్రియా సూలె మాట్లాడింది గౌరవ్ మెహతాతోనే కావడం గమనార్హం.
ఝార్ఖండ్‌లో రెండో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 38 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 67.59% పోలింగ్ జరిగింది. అటు మహారాష్ట్రలో 58.22% ఓటింగ్ నమోదైంది. అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లు ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపినట్టు లేదు. ముంబై సిటీలో 49%, ముంబై సబ్‌అర్బన్‌లో 51% ప్రజలు మాత్రమే ఓటేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ, వయనాడ్ సహా ఇతర ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సాయంత్రం 6.30కి వెలువడనున్నాయి.
AP: జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి YCP నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని BJP MLA ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన గొడవ YCP వాళ్లతోనేనని, అదానీతో కాదని, ఆ సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏర్పాటుకాని అదానీ పరిశ్రమకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణీ అవుతున్న దొంగ దుకాణాలనే తమ వాళ్లు అడ్డుకున్నారని వెల్లడించారు. YCP కంపెనీలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా ఏటా 7 సెంటీమీటర్ల మేర ఉత్తర దిశగా కదులుతోంది. ఖండాల కింద ఉండే భూ ఫలకాలను టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. కదలిక మరీ ఎక్కువగా ఉన్న చోట భూకంపాలు కూడా సంభవిస్తుంటాయి. ఆస్ట్రేలియా కింద ఉన్న ఫలకమంతా ఉత్తరదిశగా కదులుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, అది వేరే ఏ ఖండాన్ని ఢీ కొట్టాలన్నా లక్షల సంవత్సరాలు పడుతుందని అంచనా.
చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయనే విషయం తెలిసిందే. అయితే, కొన్ని తినకూడని చేపలు కూడా ఉన్నాయి. అందులో మధ్యదరా సముద్రంలో దొరికే సలేమా పోర్జీ చేప ఒకటి. ఒకవేళ ఈ చేపను తింటే ఆశ్చర్యకరమైన దుష్ప్రభావం చూపుతుంది. దీనిని తిన్న వ్యక్తి 36 గంటల పాటు అయోమయానికి లోనవుతారు. ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేరు. రోమన్ సామ్రాజ్యంలో వినోద ప్రయోజనాల కోసం దీనిని తినేవారు.
AP: తల్లి, చెల్లి పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘CBN నన్ను బోసిడీకే అని తిట్టించాడు. జూబ్లీహిల్స్ 36లోని బాలకృష్ణ బిల్డింగ్ నుంచే షర్మిలపై తప్పుడు రాతలు రాయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వర్రా రవీంద్ర పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ITDP సభ్యుడు ఉదయ్ భూషణ్ చేత మా అమ్మ, చెల్లిని తిట్టించారు. ఫిబ్రవరిలోనే అతడిని అరెస్టు చేశాం’ అని గుర్తు చేశారు.
ఝార్ఖండ్‌లో రెండో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం 38 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.47శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWS యాప్‌లో చూడండి.
Sorry, no posts matched your criteria.