News October 3, 2024

అమల ట్వీట్‌కు అక్కినేని అఖిల్ మద్దతు

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన <<14257006>>ట్వీట్‌కు<<>> అఖిల్ స్పందించారు. ‘అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన హీరో నాని

image

చైతూ-సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. ‘తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని పొలిటీషియన్లు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

రిషభ్ పంత్‌ను రిటైన్ చేసుకుంటాం: ఢిల్లీ క్యాపిటల్స్

image

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్ చేసుకుంటామని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ తెలిపారు. ‘మా జట్టులో అక్షర్, స్టబ్స్, జేక్ ఫ్రేజర్, కుల్దీప్, పొరెల్, ముకేశ్, ఖలీల్ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. అవకాశం ఉంటే అందర్నీ రిటైన్ చేసుకుంటాం. మా ఓనర్ జీఎమ్మార్, డైరెక్టర్ గంగూలీతో చర్చించాక రిటైన్ లిస్ట్ తయారు చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News October 3, 2024

మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ అసహ్యకరమైన, వికారం కలిగించే రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపినట్లు X ద్వారా వెల్లడించారు. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు? లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని పేర్కొన్నారు. ‘మీ సీఎం, మంత్రిని మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపండి’ అని రాహుల్ గాంధీకి సూచించారు.

News October 3, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 3, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:24 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:03 గంటలకు
ఇష: రాత్రి 7.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 3, 2024

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి ఆమోదయోగ్యం కాదు: బైడెన్

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఈ దాడికి రెస్పాన్స్ ఇవ్వడంపై G7 లీడర్స్‌తో ఫోన్ కాల్ ద్వారా చర్చించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు తామెప్పుడూ కట్టుబడి ఉంటామని ట్వీట్ చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసేందుకు తాము మద్దతు ఇవ్వడం లేదని బైడెన్ స్పష్టం చేశారు.

News October 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 3, 2024

అక్టోబర్ 3: చరిత్రలో ఈరోజు

image

1903: స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి రామానంద తీర్థ జననం
1923: బ్రిటిష్ ఇండియా తొలి మహిళా పట్టభద్రురాలు, తొలి మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ మరణం
1954: నటుడు సత్యరాజ్ జననం
1978: భారత్‌లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జననం
2006: సినీ నటి ఇ.వి.సరోజ మరణం

News October 3, 2024

ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మా జవాబు గట్టిగా ఉంటుంది: ఇరాన్

image

ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ తాజాగా ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసింది. తాము యుద్ధం కోరుకోమని, ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మాత్రం జవాబు గట్టిగా ఉంటుందని దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. ‘ఇజ్రాయెల్ కారణంగానే మేం స్పందించాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో అస్థిరత పెంచాలనేది ఆ దేశపు కుట్ర. ఈ రక్తపాతాన్ని ఆపాలని అమెరికా, ఐరోపా దేశాలు టెల్ అవీవ్‌కు చెప్పాలి’ అని స్పష్టం చేశారు.

News October 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.