News November 20, 2024

ఆస్ట్రేలియాదే సిరీస్ విజయం: బ్రాడ్ హాగ్

image

BGT సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో గెలుచుకుంటుందని ఆ జట్టు మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. సొంత గ్రౌండ్స్‌లో ఆడనుండటం, ప్రతిభావంతులైన సీనియర్ బౌలర్లుండటం ఆస్ట్రేలియాకు బలమని వివరించారు. ‘పేస్, బౌన్స్ ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియా పిచ్‌లపై భారత ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. వారి బౌలింగ్ కూడా అనుభవలేమితో కనిపిస్తోంది. అశ్విన్, జడేజా ఇద్దరూ తుది జట్టులో కచ్చితంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.

News November 20, 2024

రాష్ట్ర రోడ్లపై టోల్ వసూలా?.. జగన్ ఆగ్రహం

image

AP: 2014-19 మధ్య రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ₹24,792 కోట్లు ఖర్చు చేస్తే YCP హయాంలో ₹43,036 కోట్లు వెచ్చించామని జగన్ తెలిపారు. ఇంత చేసినా CBN, దత్తపుత్రుడు తమపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర రోడ్లపైకి వచ్చే ప్రజల నుంచి <<14653659>>టోల్ వసూలు<<>> చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఇదేనా సంపద సృష్టి అని ఫైరయ్యారు. ప్రజలు ట్యాక్స్ కడితేనే రోడ్లు వేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు.

News November 20, 2024

మహారాష్ట్రలో గెలిచేదెవరు? సట్టాబజార్ అంచనా ఇదే

image

పోలింగ్ ముగింపు సమయం సమీపించే కొద్దీ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఆరు పార్టీలు 2 కూటములుగా పోటీచేస్తున్నాయి. 288 సీట్లకు గాను మహాయుతి 144-152 గెలిచి మళ్లీ అధికారం చేపట్టొచ్చని రాజస్థాన్ ఫలోడి సట్టాబజార్ అంచనా వేసింది. రెండు కూటముల మధ్య ఓటింగ్ అంతరం తక్కువే ఉంటుందని, స్వింగ్ కాస్త అటు ఇటైనా ఫలితాలు మారొచ్చంది. హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న సట్టాబజార్ అంచనా తప్పడం గమనార్హం.

News November 20, 2024

Key to the City of Georgetown అసలు కథ ఇదే

image

గయానాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రాజధాని జార్జ్‌టౌన్ Key to the City అందుకున్నారు. ఇది ఆ దేశ పాల‌కుల ద్వారా అతిథికి గౌర‌వ‌సూచ‌కంగా అందించే మ‌ధ్య‌యుగ కాలం నాటి సంప్ర‌దాయం. ఆ దేశ పర్యటనకు విచ్చేసిన ప్ర‌ముఖ‌ వ్యక్తుల పట్ల విశ్వాసం, గౌరవం, స్నేహపూర్వకతకు ప్రతీకగా దీన్ని బ‌హూక‌రిస్తారు. మోదీపై గౌరవసూచకంగా, ఇరు దేశాల బంధాలు మరింత మెరుగుపడేలా ఆ దేశ పాలకులు ఈ తాళాన్ని బహూకరించారు.

News November 20, 2024

UNSC 1945లో ఉండిపోయింది: భారత్

image

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి(UNSC) మారుతున్న కాలంతో పాటు ముందుకెళ్లడం మరచిపోయిందని భారత్ విమర్శించింది. ప్రగతి విషయంలో అత్యంత నెమ్మదిగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ‘UNSC ప్రస్తుత పనితీరు 1945 నాటిదే. నేటి వాస్తవికతకు ఏమాత్రం దగ్గరగా లేదు. సహాయంలో UN అద్భుతమే. కానీ ఉద్రిక్తతల్ని కంట్రోల్ చేయడంలో మాత్రం విఫలమవుతోంది. సంస్థలో సంస్కరణలు అత్యవసరం’ అని UNలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ వ్యాఖ్యానించారు.

News November 20, 2024

కరోనా కల్లోలంలోనూ చంద్రబాబు కంటే తక్కువ అప్పులు: జగన్

image

AP: చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54 శాతం ఉంటే, తమ పాలనలో 13.57 శాతం మాత్రమేనని వైఎస్ జగన్ చెప్పారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయినా పరిమితికి లోబడే అప్పులు చేశామని తెలిపారు. కరోనా కల్లోలంలో దేశ వృద్ధి రేటు కూడా పడిపోయిందని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగం వైసీపీ పాలనలో 9వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు.

News November 20, 2024

చంద్రబాబు బకాయిలు రూ.42,183కోట్లు మేం కట్టాం: జగన్

image

AP: 2014-19 మధ్య చంద్రబాబు FRBM పరిధి దాటి రూ.28,457 కోట్ల అప్పు చేశారని వైఎస్ జగన్ వెల్లడించారు. తమ హయాంలో ఆ మొత్తం రూ.16,047 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇవన్నీ RBI, కాగ్ వెల్లడించిన గణాంకాలని చెప్పారు. ఎవరు విధ్వంసకారులో ఈ లెక్కలే చెబుతున్నాయన్నారు. చంద్రబాబు దిగిపోతూ పలు రంగాల్లో రూ.42,183 కోట్ల బకాయిలను తమకు గిఫ్ట్ ఇచ్చారని, ఆ మొత్తాన్ని తాము చెల్లించామని పేర్కొన్నారు.

News November 20, 2024

ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నిక‌ల సంఘం ఏం చెప్పింది?

image

ఎగ్జిట్ పోల్స్ విష‌యంలో స‌ర్వే సంస్థలకు స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌ర‌మ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం గతంలో వ్యాఖ్యానించింది. ‘ఎన్ని శాంపిల్స్ సేక‌రించారు? ఎక్క‌డ స‌ర్వే చేశారు? ఒక వేళ ఫ‌లితాలు అంచనాలకు విరుద్ధంగా వ‌స్తే సంస్థ‌లు ఎంత‌వ‌ర‌కు బాధ్య‌త తీసుకుంటాయి?’ అని ప్రశ్నించింది. సర్వేలతో త‌మ‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంచ‌నాలు, ఫ‌లితాలు విరుద్ధంగా ఉండడం స‌మ‌స్యకు దారి తీస్తుంద‌ని పేర్కొంది.

News November 20, 2024

కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు: రేవంత్

image

TG: లగచర్లలో కొందరిని ఉసిగొల్పి అధికారులపై దాడులు చేయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు. రెచ్చగొట్టి, దాడులు చేసిన వాళ్లను శిక్షించొద్దా? పరిశ్రమలకు బీఆర్ఎస్ అడ్డుపడుతోంది. నేను అడిగింది లక్ష ఎకరాలు కాదు, వెయ్యి ఎకరాలే. గడ్డి కూడా మొలవని భూమిలో పరిశ్రమలు పెడతామంటే అడ్డుకుంటున్నారు’ అని వేములవాడ సభలో రేవంత్ మండిపడ్డారు.

News November 20, 2024

సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తారా?

image

మరో రెండు రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలవనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ముంగిట ఉన్న ఓ రికార్డు గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు సిరీస్‌ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ టెండూల్కర్‌(9) పేరిట ఉంది. ఆయన తర్వాత 8 సెంచరీలతో కోహ్లీ (42మ్యాచ్‌లు), పాంటింగ్ ఉన్నారు. ఈ సిరీస్‌లో కోహ్లీ 2 సెంచరీలు చేస్తే రికార్డును తిరగరాసే అవకాశం ఉంది. మరి ఈ రికార్డును ఆయన తిరగరాస్తారా?