News July 11, 2025

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలివే!

image

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. ప్రతిరోజూ ఉ.8-10 గంటల వరకు, రా.7-9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
* 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, * 23-09-2025 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, * 24-09-2025 ధ్వజారోహణం, * 28-09-2025 గరుడ వాహనం, * 01-10-2025 రథోత్సవం,
* 02-10-2025 చక్రస్నానం

News July 11, 2025

కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ విడుదల

image

AP: పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదలైంది. 6,100 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూన్‌ 1న తుది పరీక్ష నిర్వహించింది. 37,600 మంది పరీక్ష రాయగా, 33,921 మంది క్వాలిఫై అయ్యారు. 12వ తేదీలోపు రూ.1000 చెల్లించి OMR వెరిఫికేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి స్కోర్ తెలుసుకోండి. కటాఫ్, ఫైనల్ రిజల్ట్స్‌ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

News July 11, 2025

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కవిత

image

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని BRS MLC కవిత ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర బీసీలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని అభివర్ణించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

News July 10, 2025

అరుదైన రికార్డు సృష్టించిన రూట్

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్(81*) అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో భారత్‌పై 3 వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 33 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 2555, కుక్ 2431, స్టీవ్ స్మిత్ 2356*, క్లైవ్ లాయిడ్ 2344 రన్స్‌ చేశారు.

News July 10, 2025

PIC OF THE DAY

image

TG: గురుపౌర్ణమి వేళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నిశీధిలో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుండగా గోపురంపై నిండు చంద్రుడు ఆసీనుడైనట్లు కనిపిస్తున్న చిత్రం కనువిందు చేస్తోంది. కాగా గురుపౌర్ణమి సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

News July 10, 2025

17వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం: పొన్నం

image

TG: నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో 60వేల ఉద్యోగాలు ఇచ్చాం. 17వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల‌పై ఆఫీసర్స్ కమిటీ వేసి స్ట్రీమ్‌లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి వివరించారు.

News July 10, 2025

భూకంపాలు ఎందుకు వస్తాయంటే?

image

భూమి ఆకస్మికంగా కంపించడాన్నే భూకంపం అంటారు. భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు బలంగా కదిలినప్పుడు భూకంపం వస్తుంది. భూపాతాలు, హిమపాతాలు, సొరంగాలు, గనుల పైకప్పులు కూలినప్పుడు ఇవి సంభవిస్తాయి. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రకంపనలు చాలా దూరం వ్యాపిస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 7 దాటితే భవనాలు పేకమేడల్లా కూలుతాయి. రోడ్లు చీలిపోతాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది.

News July 10, 2025

PHOTO GALLERY: ‘మెగా PTM’లో CBN, లోకేశ్

image

AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్-2025(PTM)లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ బిజీబిజీగా గడిపారు. విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. పిల్లలకు సీఎం పాఠాలు చెప్పారు. సీఎం, మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇవాళ్టి కార్యక్రమాలకు సంబంధించి వారు Xలో ఫొటోలు షేర్ చేశారు.

News July 10, 2025

ఈనెల 25న మరోసారి క్యాబినెట్ భేటీ

image

TG: ఇవాళ్టితో కలిపి INC ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 19సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించి 327అంశాలపై చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు ఆమోదించిన అంశాల అమలుపై ఇవాళ సమీక్షించినట్లు చెప్పారు. నెలకు 2సార్లు క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన మేరకు ఈనెల 25న మరోసారి సమావేశం అవుతామన్నారు. అమిటీ, సెంటినరీ రీహాబిటేషన్ విద్యాసంస్థలను వర్సిటీలుగా మార్చాలని నిర్ణయించామన్నారు.

News July 10, 2025

ఇంగ్లండ్ నాలుగు వికెట్లు డౌన్

image

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే పోప్‌ను జడేజా ఔట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బౌల్డ్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రూట్(62*), కెప్టెన్ స్టోక్స్(0*) ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 172/4గా ఉంది.