News July 10, 2025

KCRకు వైద్య పరీక్షలు పూర్తి

image

TG: BRS అధినేత, మాజీ సీఎం KCRకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈనెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల చికిత్స అనంతరం 5వ తేదీన డిశ్చార్జ్ చేశారు. మరోసారి టెస్టుల కోసం రావాలని డాక్టర్లు సూచించడంతో ఇవాళ KCR ఆస్పత్రికి వెళ్లారు.

News July 10, 2025

లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న జొమాటో ఫౌండర్.. ధర రూ.52.3 కోట్లు!

image

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ హరియాణాలోని గురుగ్రామ్‌లో ₹52.3కోట్లతో సూపర్ లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్నారు. DLF సంస్థ నిర్మించిన ‘ది కామెల్లియాస్‌’ రెసిడెన్షియల్ సెక్టార్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. దీని విస్తీర్ణం 10,813 స్క్వేర్ ఫీట్లు. ఇందులో 5 పార్కింగ్ స్పేస్‌లు ఉంటాయి. దీపిందర్ 2022లోనే దీనిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది MARలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ₹3.66cr స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.

News July 10, 2025

BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 4గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీ ముగిసింది.

News July 10, 2025

HCA అధ్యక్షుడికి రిమాండ్

image

HYD క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు <<17021009>>జగన్మోహన్ రావుతో<<>> పాటు ఐదుగురికి మేడ్చల్ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కాసేపట్లో నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. IPL మ్యాచుల సందర్భంగా అదనంగా 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు పాలకవర్గ సభ్యులను CID నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News July 10, 2025

BREAKING: పంత్‌కు గాయం

image

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ సందర్భంగా భారత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. కీపింగ్ చేస్తుండగా బంతి అతడి వేలుకి బలంగా తాకింది. దీంతో ఫిజియో వచ్చి పంత్ వేలికి ట్రీట్‌మెంట్ చేసినా నొప్పి తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడారు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేస్తున్నారు. గాయం పెద్దదై పంత్ బ్యాటింగ్ చేయలేకపోతే టీమ్ ఇండియాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

News July 10, 2025

టెన్నిస్ ప్లేయర్ దారుణ హత్య

image

యువ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్‌(25)ను ఆమె తండ్రి దారుణంగా హత్య చేశారు. ఈ ఉ.10.30గంటలకు హరియాణా గురుగ్రామ్‌లోని ఇంట్లో రాధికపై ఆయన పలు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇన్‌స్టా రీల్స్ చేయొద్దని పలుమార్లు హెచ్చరించినా రాధిక వినకపోవడంతోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News July 10, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ.. కాసేపట్లో ఎన్నికలపై క్లారిటీ?

image

TG: సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ 3 గంటలుగా కొనసాగుతోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలులో పురోగతి, శాఖల పనితీరుపై చర్చిస్తున్నట్లు సమాచారం.

News July 10, 2025

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. త్వరలో ముగియనున్న గడువు

image

TG: వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ (TGMBCDC) నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తోంది. 4 రోజుల పాటు సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, రెజ్యూమ్ తయారీ, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. 21-30 ఏళ్ల వయసు, డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తు గడువు ఈనెల 12తో ముగుస్తుంది. పూర్తి వివరాలకు <>https://tgobmms.cgg.gov.in/<<>> వెబ్‌సైట్‌ను సందర్శించండి.

News July 10, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* రెండున్నర గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీ
* ఆగస్టు లోగా మెగా DSC పూర్తి చేస్తాం: లోకేశ్
* 20న నల్గొండ(D) దేవరకొండ పర్యటనకు CM రేవంత్
* Dy.CM పవన్ ఆదేశాలు.. విజయనగరం(D) దేవాడ మాంగనీస్ గనిలో అధికారుల తనిఖీలు
* కల్తీ కల్లు మృతుల కుటుంబాలకు రూ.20లక్షలివ్వాలి: KTR
* పుట్టపర్తి సత్యసాయి మహాసన్నిధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు

News July 10, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹220 పెరిగి ₹98,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹90,200 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.