News November 20, 2024

25న విచారణకు రండి.. RGVకి మళ్లీ నోటీసులు

image

AP: చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై అనుచిత పోస్టుల ఆరోపణల కేసులో ఈ నెల 25న విచారణకు రావాలని డైరెక్టర్ ఆర్జీవీకి పోలీసులు నోటీసులు పంపారు. ఈ నెల 19నే విచారణకు హాజరుకావాల్సి ఉండగా, తనకు సమయం కావాలని ఆర్జీవీ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి నోటీసులిచ్చారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన <<14655734>>పిటిషన్<<>> రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

News November 20, 2024

నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్

image

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచారు. 244 పాయింట్లతో ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాగే టాప్-5లో దీపేంద్ర, లివింగ్‌స్టోన్, స్టొయినిస్, హసరంగ ఉన్నారు. మరోవైపు టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవి బిష్ణోయ్ (8), అర్ష్‌దీప్ (9) టాప్-10లో కొనసాగుతున్నారు. అగ్ర స్థానంలో ఆదిల్ రషీద్ ఉన్నారు.

News November 20, 2024

బిష్ణోయ్ తమ్ముడిని US పోలీసులు ఎందుకు అరెస్టు చేశారంటే?

image

అన్మోల్ బిష్ణోయ్ అరెస్టు వ్యవహారంలో కొత్త అప్డేట్. US పోలీసులు అతడిని భారత్‌లో నమోదైన కేసుల్లో అరెస్టు చేయలేదని సమాచారం. అక్రమ పత్రాలతో అమెరికాలో ప్రవేశించడమే అసలు కారణమని తెలిసింది. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధికీ హత్యలు, సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసుల్లో అతడు మోస్ట్ వాంటెండ్. కేంద్రం అభ్యర్థించినప్పటికీ US అతడిని భారత్‌కు పంపే అవకాశం లేదని తెలిసింది. అతనిప్పుడు పొటావాటమీ కౌంటీ జైల్లో ఉన్నాడు.

News November 20, 2024

చైనాలో 40వేల స్క్రీన్లలో రిలీజవుతున్న ‘మహారాజ’

image

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం చైనాలో రిలీజ్‌కు సిద్ధమైంది. చైనా వ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో ఈనెల 29న విడుదల కానుంది. దీంతో చైనాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా ‘మహారాజ’ నిలువనుంది. మరి ఏ స్థాయి కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

News November 20, 2024

Index Fundsపై Gen Z, Millennials ఆసక్తి

image

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డుల విష‌యంలో వివిధ వ‌య‌సుల వారి మ‌ధ్య‌ స్ప‌ష్ట‌మైన వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. ETFల కంటే Index Fundsలో పెట్టుబ‌డుల‌కు 46% Gen Z, Millennials అధిక ఆస‌క్తి చూపుతున్నారు. అలాగే Smart Beta Fundsలో పెట్టుబ‌డుల‌తో త‌మ Portfolioను Diversified చేస్తున్నారు. ఇక Gen X, బూమర్స్‌లో 35% మాత్ర‌మే ఇండెక్స్ ఫండ్స్‌పై ఆస‌క్తిచూపుతున్నారు. 2024లో Passive fundsలో 80% పెట్టుబ‌డులు పెరిగాయి.

News November 20, 2024

రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్‌తోనే: అనిల్

image

AP: తాను పార్టీ మారబోతున్నానంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నానని, త్వరలోనే నాన్‌స్టాప్ కార్యక్రమాలు చేస్తానని ప్రకటించారు. ‘నాపై అక్రమ కేసులు పెట్టించి కొందరు శునకానందం పొందుతున్నారు. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా’ అని హెచ్చరించారు.

News November 20, 2024

అర్ధరాత్రి నుంచి OTTలోకి కొత్త సినిమా

image

ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ‘ఉగ్రం’లో హీరోగా నటించిన శ్రీమురళి ప్రధాన పాత్రలో సూరీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘బఘీరా’. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచి OTTలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తులు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

News November 20, 2024

అవినాశ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదు: షర్మిల

image

AP: తనతో పాటు విజయమ్మ, సునీతపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టించింది YCP MP అవినాశ్ రెడ్డేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారని APCC చీఫ్ షర్మిల అన్నారు. అలాంటప్పుడు ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాశ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డే ప్రధాన కారకుడని ఆరోపించారు. ఆయననూ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

News November 20, 2024

రైలు ప్రయాణంలో ఇవి తెలుసుకోండి!

image

టికెట్ లేకుండా రాత్రిపూట రైలెక్కిన మహిళను దింపేసే అధికారం TTEకి లేదు. 1989 రైల్వే చట్టంలో ఒంటరిగా, పిల్లలతో ప్రయాణించే మహిళలకు రక్షణ కల్పించింది. రైళ్లలో ఉచితంగా 70 కేజీల వరకే కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతిస్తారు. ఒకవేళ ట్రైన్ మిస్ అయినా తదుపరి రెండు స్టేషన్ల వరకు మీకు కేటాయించిన సీటు అలాగే ఉంటుంది. రిజర్వేషన్ బోగీలోని మిడిల్ బెర్త్ ప్యాసింజర్ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే నిద్రపోవాలి.

News November 20, 2024

CM రేవంత్‌కు KCR భయం పట్టుకుంది: హరీశ్

image

TG: CM రేవంత్‌కు KCR భయం పట్టుకుందని BRS MLA హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. KCRకు, రేవంత్‌‌కు చాలా తేడా ఉందని అన్నారు. మహబూబ్‌నగర్‌లో కురుమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15లోపు సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తాను రాజీనామా చేసేవాడినని అన్నారు. 42లక్షల మందికి అని చెప్పి కేవలం 22లక్షల మంది రైతులకే మాఫీ చేసి, పైగా తనను రాజీనామా చేయమంటున్నారని చెప్పుకొచ్చారు.