India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమకు వయసుతో సంబంధం లేదని కేరళకు చెందిన ఓ వృద్ధ జంట నిరూపించింది. రామవర్మపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 79 ఏళ్ల విజయ రాఘవన్, 75 ఏళ్ల సులోచన మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఆ రాష్ట్ర మంత్రి ఆర్.బిందు, సిటీ మేయర్ వర్గీస్, అధికారులు హాజరయ్యారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక అంటూ వైరలవుతున్న లేఖ ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. ఆ నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేయలేదని పేర్కొంది. సరైన సమాచారాన్ని అధికార వర్గాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. గత నెల 12న జరిగిన విమాన ప్రమాదంలో 34 మంది స్థానికులతో కలిపి 275 మంది మరణించినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.
‘బాహుబలి’ సినిమాను అక్టోబర్ 31న రీరిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు. ఆ మూవీ విడుదలై నేటికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ‘బాహుబలి-1’, ‘బాహుబలి-2’లను కలిపి ‘బాహుబలి ఎపిక్’ పేరుతో ఒకేసారి రిలీజ్ చేస్తామని జక్కన్న ట్వీట్ చేశారు. నిడివి ఎక్కువ కాకుండా ఆ రెండు సినిమాల్లోని ముఖ్యమైన సన్నివేశాలతో రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
AP: మంత్రి లోకేశ్ విద్యాశాఖను అద్భుతంగా నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆయన ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. ‘మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం పాఠశాల. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతోకొంత సాయం చేయాలి. ఆడ, మగ బిడ్డలను సమానంగా చూసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే మేం ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం’ అని సత్యసాయి జిల్లాలో తెలిపారు.
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అటు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 16 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మీ ప్రాంతాల్లో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
గుజరాత్‌లోని వడోదరలో గంభీర <<17001744>>బ్రిడ్జి<<>> కూలిన ఘటనలో మరణాల సంఖ్య 15కు చేరింది. ఇవాళ మహిసాగర్ నది నుంచి మరో నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రెండు లారీలతో సహా తొమ్మిది వాహనాలు నదిలో పడిపోయాయి. కాగా బ్రిడ్జి కూలడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. బీటలు వచ్చినా దాన్ని మూసివేయలేదని పేర్కొన్నారు.
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో లోక్‌సభ MPలకూ భాగస్వామ్యం కల్పించాలని CM రేవంత్‌ను BJP MP రఘునందన్ రావు కోరారు. ‘లబ్ధిదారుల ఎంపికలో స్థానిక MLAలకు 40% కోటా కేటాయించడం ప్రశంసనీయం. MLAల తరహాలోనే ప్రజల మద్దతుతో గెలిచిన 17 మంది MPలకూ 40% కోటా కేటాయించండి. దీని వల్ల కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో అమలవుతున్న పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది’ అని బహిరంగ లేఖ రాశారు.
AP: రాష్ట్రంలో రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని YCP నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ అప్పులపై ప్రశ్నిస్తే తాము దేశద్రోహులమా? అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? తల్లికి వందనం కొంతమందికే ఇచ్చారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యాయి?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
కేరళ నర్సు <<17009348>>నిమిష<<>> ప్రియ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 14కు విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో భారత ప్రభుత్వం దౌత్యపరమైన జోక్యం చేసుకోవాలని పిటిషనర్ కోరారు. కాగా వ్యాపారి హత్య కేసులో యెమెన్ ప్రభుత్వం నిమిషకు ఈ నెల 16న మరణశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అటు కేంద్రం కూడా ఈ విషయంలో ఆమెను కాపాడాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.