News November 20, 2024

Index Fundsపై Gen Z, Millennials ఆసక్తి

image

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డుల విష‌యంలో వివిధ వ‌య‌సుల వారి మ‌ధ్య‌ స్ప‌ష్ట‌మైన వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. ETFల కంటే Index Fundsలో పెట్టుబ‌డుల‌కు 46% Gen Z, Millennials అధిక ఆస‌క్తి చూపుతున్నారు. అలాగే Smart Beta Fundsలో పెట్టుబ‌డుల‌తో త‌మ Portfolioను Diversified చేస్తున్నారు. ఇక Gen X, బూమర్స్‌లో 35% మాత్ర‌మే ఇండెక్స్ ఫండ్స్‌పై ఆస‌క్తిచూపుతున్నారు. 2024లో Passive fundsలో 80% పెట్టుబ‌డులు పెరిగాయి.

News November 20, 2024

రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్‌తోనే: అనిల్

image

AP: తాను పార్టీ మారబోతున్నానంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నానని, త్వరలోనే నాన్‌స్టాప్ కార్యక్రమాలు చేస్తానని ప్రకటించారు. ‘నాపై అక్రమ కేసులు పెట్టించి కొందరు శునకానందం పొందుతున్నారు. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా’ అని హెచ్చరించారు.

News November 20, 2024

అర్ధరాత్రి నుంచి OTTలోకి కొత్త సినిమా

image

ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ‘ఉగ్రం’లో హీరోగా నటించిన శ్రీమురళి ప్రధాన పాత్రలో సూరీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘బఘీరా’. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచి OTTలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తులు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

News November 20, 2024

అవినాశ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదు: షర్మిల

image

AP: తనతో పాటు విజయమ్మ, సునీతపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టించింది YCP MP అవినాశ్ రెడ్డేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారని APCC చీఫ్ షర్మిల అన్నారు. అలాంటప్పుడు ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాశ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డే ప్రధాన కారకుడని ఆరోపించారు. ఆయననూ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

News November 20, 2024

రైలు ప్రయాణంలో ఇవి తెలుసుకోండి!

image

టికెట్ లేకుండా రాత్రిపూట రైలెక్కిన మహిళను దింపేసే అధికారం TTEకి లేదు. 1989 రైల్వే చట్టంలో ఒంటరిగా, పిల్లలతో ప్రయాణించే మహిళలకు రక్షణ కల్పించింది. రైళ్లలో ఉచితంగా 70 కేజీల వరకే కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతిస్తారు. ఒకవేళ ట్రైన్ మిస్ అయినా తదుపరి రెండు స్టేషన్ల వరకు మీకు కేటాయించిన సీటు అలాగే ఉంటుంది. రిజర్వేషన్ బోగీలోని మిడిల్ బెర్త్ ప్యాసింజర్ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే నిద్రపోవాలి.

News November 20, 2024

CM రేవంత్‌కు KCR భయం పట్టుకుంది: హరీశ్

image

TG: CM రేవంత్‌కు KCR భయం పట్టుకుందని BRS MLA హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. KCRకు, రేవంత్‌‌కు చాలా తేడా ఉందని అన్నారు. మహబూబ్‌నగర్‌లో కురుమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15లోపు సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తాను రాజీనామా చేసేవాడినని అన్నారు. 42లక్షల మందికి అని చెప్పి కేవలం 22లక్షల మంది రైతులకే మాఫీ చేసి, పైగా తనను రాజీనామా చేయమంటున్నారని చెప్పుకొచ్చారు.

News November 20, 2024

ఎల్లుండి నుంచి RC16 మూవీ షూటింగ్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించనున్న RC16 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈనెల 22న మైసూర్‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఇటీవల జాన్వీకపూర్ నటించిన ‘దేవర’ రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.

News November 20, 2024

ICC ర్యాంకింగ్స్‌లో టాప్-3కి తిలక్ వర్మ

image

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ICC T20I ర్యాంకింగ్స్‌లో రయ్యుమని దూసుకెళ్లారు. ఒకేసారి ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్3కి చేరుకున్నారు. టాప్‌1లో ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) ఉండగా 2వ స్థానంలో సాల్ట్(ఇంగ్లండ్) ఉండగా ఆ తర్వాతి స్థానాన్ని తిలక్ కైవసం చేసుకున్నారు. అరంగేట్రం తర్వాత కేవలం 20 మ్యాచుల్లో తిలక్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. ఇటీవల SAపై వరుస సెంచరీలు చేసిన వర్మ మొత్తం 51.33 సగటుతో 616 రన్స్ చేశారు.

News November 20, 2024

భారత్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు మెస్సీ?

image

2025లో కేరళతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ 2 మ్యాచ్‌లు ఆడుతుందని ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఇందులో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కూడా ఆడతారని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కేరళలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ ఎక్కువ. భారత్‌లో ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడే కొన్ని రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. మెస్సీ చివరిగా 2011లో ఇండియాలో ఆడారు.

News November 20, 2024

థియేటర్లలోకి వారికి నో ఎంట్రీ!

image

యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిల్మ్ క్రిటిక్‌లపై తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లలోకి వారిని అనుమతించకూడదని యాజమాన్యాలను కోరింది. రివ్యూల పేరుతో నటీనటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండటంతో TFPC ఈ నిర్ణయం తీసుకుంది. వీరి రివ్యూలు వేట్టయన్, ఇండియన్ 2, కంగువా చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది.