India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జులై నెల కోటా APR 19న ఉ.10 గం.కు విడుదల కానుంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఎల్లుండి నుంచి 21వ తేదీ ఉ.10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లు 22న ఉ.10 గంటలకు రిలీజ్ కానున్నాయి. జులై కోటా రూ.300 ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లు 24న ఉ.10 గంటలకు, మ.3 గంటలకు గదుల కోటా రిలీజ్ కానుంది.
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో ఒకే వేదికలో 100కు పైగా సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోహ్లీ(130), గేల్(127), డివిలియర్స్(118) వందకు పైగా సిక్సర్లు బాదారు. వాంఖడేలో రోహిత్ 102 సిక్సర్లు కొట్టగా ఆ తర్వాతి స్థానంలో పొలార్డ్(85) ఉన్నారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మే 8న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మే 6 సాయంత్రంలోగా మంత్రివర్గ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం ఇతర పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
AP: రాష్ట్రంలో డీఎస్సీ-2025కి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ధారించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు చవిచూస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్‌లో రష్మిక హీరోయిన్‌గా భారీ అంచనాలతో మార్చి 30న విడుదలైన ‘సికందర్’ ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.177 కోట్లే వసూలు చేసిందని సినీ వర్గాలు తెలిపాయి. యువరాజ్(2008) తర్వాత సల్మాన్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ఫ్లాప్ అని పేర్కొన్నాయి.
ముంబైతో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(40), క్లాసెన్(37) ఫర్వాలేదనిపించినా హెడ్(29 బంతుల్లో 28), నితీశ్(19), కిషన్(2) విఫలమయ్యారు. ఓ దశలో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో SRH బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. చివర్లో అనికేత్ 8 బంతుల్లో 18 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదైంది. విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు. MI టార్గెట్ 163.
AP: మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విన్నపంతో 534 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి సహకరించిన కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, జేపీ నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘అలప్పుజ జింఖానా’ తెలుగులో రిలీజ్ కానుంది. ఇప్పటికే రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 25న తెలుగులో విడుదల కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
* MI పార్ట్ టైమ్ బౌలర్ విల్ జాక్స్‌కు రెండు వికెట్లు
* అభిషేక్(40), నిరాశపరిచిన కిషన్
* క్యాచులు డ్రాప్ చేసినా సద్వినియోగం చేసుకోని SRH బ్యాటర్లు
* గాయంతో మైదానం వీడిన కరణ్ శర్మ
* 2 ఓవర్లలో 10 పరుగులిచ్చిన బుమ్రా
* 15 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు
AP: పాస్టర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాస్టర్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. మొత్తం 8,427 మంది పాస్టర్లకు 7 నెలల(2024 మే-నవంబర్) కాలానికి రూ.30 కోట్లు రిలీజ్ చేశారు. ఎన్నికల సమయంలో పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.