News November 20, 2024

భారత్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు మెస్సీ?

image

2025లో కేరళతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ 2 మ్యాచ్‌లు ఆడుతుందని ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఇందులో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కూడా ఆడతారని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కేరళలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ ఎక్కువ. భారత్‌లో ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడే కొన్ని రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. మెస్సీ చివరిగా 2011లో ఇండియాలో ఆడారు.

News November 20, 2024

థియేటర్లలోకి వారికి నో ఎంట్రీ!

image

యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిల్మ్ క్రిటిక్‌లపై తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లలోకి వారిని అనుమతించకూడదని యాజమాన్యాలను కోరింది. రివ్యూల పేరుతో నటీనటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండటంతో TFPC ఈ నిర్ణయం తీసుకుంది. వీరి రివ్యూలు వేట్టయన్, ఇండియన్ 2, కంగువా చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది.

News November 20, 2024

చంద్రబాబు పాలనపై విశ్వాసం ఉంది: పవన్ కళ్యాణ్

image

AP: సీఎం చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చన్నారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ కొనియాడారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.

News November 20, 2024

నేరాలు చేస్తే తాట తీస్తాం: చంద్రబాబు

image

AP: కరడుగట్టిన నేరస్థులకు రాష్ట్రంలో చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. ‘గత ప్రభుత్వ హయాంలో నేరాలు, ఘోరాలు ఎక్కువయ్యాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ కారణంగానే నేరాలు జరుగుతున్నాయి. అందుకే వాటిపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇకపై ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో అదే చేస్తాం’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

News November 20, 2024

సైబర్ బాధితుడికి పరిహారం ఇవ్వాలని SBIని ఆదేశించిన ఢిల్లీ HC

image

సైబర్ దాడికి గురైన బాధితుడికి పరిహారం ఇవ్వాలంటూ SBIని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హరే రామ్ సింగ్ సైబర్ మోసానికి గురై, వెంటనే దగ్గర్లోని SBIకి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సిబ్బంది 2 నెలల తర్వాత అతడి అభ్యర్థనను తిరస్కరించారు. అతడు ఫ్రాడ్ లింక్ ఓపెన్ చేయడం, OTP చెప్పడాన్ని సాకుగా చూపారు. అయితే SBIది నిర్లక్ష్యమైన స్పందనగా పేర్కొన్న HC ₹2.6లక్షలు బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.

News November 20, 2024

ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్‌ న్యూస్?

image

TG: ముగ్గురు సంతానం ఉన్న వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీ‌రాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయించిందని సమాచారం. దీంతో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు కూడా సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అటు APలో ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి పోటీకి అవకాశం కల్పించింది.

News November 20, 2024

రోహిత్, కోహ్లీ, జడేజాకు షాక్?

image

భారత జట్టు సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజాల టెస్ట్ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. వాళ్లను పక్కనబెట్టాలని డిమాండ్లు వస్తుండటంతో BGT సిరీస్‌లో వారి ఆటతీరును BCCI స్వయంగా పర్యవేక్షించనుంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియాలోనే ఉండి కోచ్ గంభీర్‌తో కలిసి ఈ ముగ్గురి భవిష్యత్తుపై చర్చింవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే వాళ్లకు ఆఖరి సిరీస్ అయ్యే ఛాన్సూ ఉంది.

News November 20, 2024

పంత్‌తో ఆడాలంటే ప్లాన్ B, C అవసరం: హేజిల్‌వుడ్

image

ఇండియాతో ఫస్ట్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పంత్ వంటి బ్యాటర్లకు బౌలింగ్ చేయాలంటే బౌలర్ల వద్ద ప్లాన్ B, C కూడా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్‌ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి అతడిని అడ్డుకోవడంపై హేజిల్‌వుడ్ స్పందించారు. భారత జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందని జోష్ చెప్పారు.

News November 20, 2024

RECORD: బిట్‌కాయిన్ @ రూ.80లక్షలు

image

క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ రికార్డులను తిరగరాస్తోంది. తొలిసారి $94000ను టచ్ చేసింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.80లక్షలకు చేరువగా ఉంటుంది. క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ Bakktను డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థ కొనుగోలు చేయనుందన్న వార్తలే దీనికి కారణం. పైగా ఆయన క్రిప్టో ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్‌ తీసుకొస్తారన్న అంచనాలూ పాజిటివ్ సెంటిమెంటును పెంచాయి. ప్రస్తుతం BTC $92000 వద్ద చలిస్తోంది.

News November 20, 2024

సింగిల్స్‌కు చైనా కంపెనీ బంపరాఫర్

image

సింగిల్‌గా ఉన్న తమ ఉద్యోగులకు ఓ చైనా కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. షెన్ జెన్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ తమ ఉద్యోగులు డేట్‌కు వెళ్తే నగదు బహుమతి ఇస్తోంది. కంపెనీలోని సింగిల్స్‌కు డేటింగ్ ఖర్చుల కోసం రూ.770 అందిస్తోంది. ఒకవేళ డేటింగ్‌లో ఉంటే ఇద్దరికీ చెరో రూ.11,650 ఇస్తోంది. పెళ్లిళ్లు చేసుకోకపోవడం, తద్వారా జనాభా తగ్గుతుండటంతో చైనా ప్రభుత్వంతోపాటు అక్కడి కంపెనీలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.