News November 20, 2024

నయనతార ఓపెన్ లెటర్‌పై స్పందించిన ధనుష్ తండ్రి

image

హీరో ధనుష్‌కు నయనతార రాసిన <<14626837>>ఓపెన్ లెటర్‌పై<<>> అతని తండ్రి కస్తూరి రాజా స్పందించారు. ‘మాకు పని ముఖ్యం. అందుకే ముందుకు సాగుతున్నాం. వెన్నుపోటు పొడిచే వారికి సమాధానం చెప్పే సమయం మాకు లేదు. నాలాగే నా కొడుకు దృష్టి కూడా పనిపైనే ఉంటుంది’ అని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దానే’ మూవీ క్లిప్స్ వాడుకున్నందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు ధనుష్‌ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

News November 20, 2024

మణిపుర్ అగ్నికి వాయువు జోడించిన చిదంబరం

image

‘ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే ఒకే రాష్ట్రంలో మైతేయ్, నాగా, కుకీలు కలిసి బతుకుతారని’ మణిపుర్‌పై మాజీ HM చిదంబరం చేసిన ట్వీట్ పాత గాయాల్ని రేపినట్టైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వినతి మేరకు ఆ ట్వీట్‌ను తొలగించారు. ప్రశాంతత నెలకొన్న రాష్ట్రంలో మంటలు చెలరేగడానికి చిదంబరమే కారణమని CM బిరేన్ సింగ్ ఆరోపించారు. గతంలో మయన్మార్ విద్రోహ శక్తులతో చేతులు కలిపారంటూ ఆయన ఫొటోను బయటపెట్టారు.

News November 20, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద ట్రక్కులివే

image

సాధారణంగా రోడ్లపై కనిపించే టిప్పర్, లారీలను చూసి వాటిని భారీ వాహనాలుగా పరిగణిస్తుంటాం. అయితే, అంతకు పది రెట్ల కంటే పెద్దవైన ట్రక్కులున్నాయి. అందులో బెలాజ్ 75710 ట్రక్కు ప్రపంచంలోనే అతిపెద్దది & బలమైనది. ఇది 800 టన్నుల బరువును మోయగలదు. దీని తర్వాత 400- 450 టన్నుల బరువును మోసే క్యాటర్ పిల్లర్ 797F ట్రక్కు ఉంది. Liebherr T 284 ట్రక్కు 366 టన్నులు, Komatsu 960E-1 ట్రక్కు 325 టన్నులు మోస్తుంది.

News November 20, 2024

జీవితంలో పెళ్లి చేసుకోను: ఐశ్వర్య లక్ష్మి

image

మ్యారేజీపై తన ఒపీనియన్‌ను మార్చుకున్నారు నటి ఐశ్వర్య లక్ష్మి. జీవితంలో పెళ్లి చేసుకోనని, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ‘హలో మమ్మీ’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘25ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలనుకున్నా. ఓ మ్యాట్రిమోనిలో ప్రొఫైల్ కూడా పెట్టా. కానీ కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వారందరూ రాజీపడి బతుకుతున్నారు. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

News November 20, 2024

‘పుష్ప2’కు రష్మిక రెమ్యునరేషన్ ఎంతంటే?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నటించినందుకుగానూ ఆమె రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా రష్మిక ఈ చిత్రంలో ‘శ్రీవల్లి’ పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News November 20, 2024

వేములవాడలో అన్నదాన కేంద్రం

image

TG: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కేంద్రం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రూ.35.25 కోట్ల నిధులను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్, VTDA విజ్ఞప్తితో సీఎం కార్యాలయం స్పందించి ఈ నిధులు కేటాయించింది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న ఈ ఆలయంలో అన్నదాన కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది.

News November 20, 2024

గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా మారుస్తాం: CM రేవంత్

image

TG: కుల సర్వేతో మిమ్మల్ని గర్వించేలా చేయడం మరింత శక్తినిస్తుందంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ CM రేవంత్ ట్వీట్ చేశారు. ‘మీ ముందుచూపు, ఆలోచనలు, పని నుంచే మేం ప్రేరణ పొందాం. మీ వాగ్దానాలకు అనుగుణంగా TG గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా, మార్గదర్శకంగా మారుస్తాం’ అని CM పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని రాహుల్ రాసిన లేఖకు స్పందనగా రేవంత్ ఈ ట్వీట్ చేశారు.

News November 20, 2024

రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్సే

image

రామ్ పోతినేని హీరోగా ‘RAPO22’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని పి.మహేశ్ బాబు తెరకెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. రేపు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ మూవీపై అప్డేట్స్ వస్తాయని సమాచారం.

News November 20, 2024

అర్హపై అభినందనలు.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్

image

‘అన్‌స్టాపబుల్’లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూతురు అర్హ తెలుగు పద్యంతో హోస్ట్ బాలకృష్ణతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఎంతో క్లిష్టమైన ‘అటజని కాంచె’ పద్యాన్ని గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో అర్హపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో తాజాగా బన్నీ ఓ పోస్ట్ చేశారు. ‘అల్లు అర్హ అంటే నాన్న కూతురు అనుకుంటివా.. నాన్న(అల్లు) యువరాణి’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.

News November 20, 2024

అధికారులపై స్పీకర్ అయ్యన్న ఫైర్

image

AP: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. వారి నిర్లక్ష్యంతోనే అసెంబ్లీలో గందరగోళం నెలకొందని ఆయన ఫైర్ అయ్యారు. ‘అధికారులు తమ శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారు? ఒకే మంత్రికి ఒకే సమయంలో రెండు సభల్లో ఎలా ప్రశ్న వేస్తారు. ప్రశ్న ఒకటి. మంత్రిత్వ శాఖ మరొకటి ఉంటుంది. మరోసారి ఇలాంటివి రిపీట్ కానివ్వొద్దు’ అని ఆయన మండిపడ్డారు.