News July 9, 2025

తిరుపతి వేదికగా జాతీయ మహిళా సదస్సు: స్పీకర్ అయ్యన్న

image

APలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది పాల్గొనే ఈ సమావేశాలను తిరుపతి వేదికగా నిర్వహిస్తామన్నారు. అటు ఆగస్టు మొదటి లేదా రెండోవారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్‌లో స్పీకర్ మాట్లాడారు.

News July 9, 2025

రేపు ‘బాహుబలి’ రీరిలీజ్ తేదీ ప్రకటన?

image

ప్రభాస్& రానా ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకేసారి రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ అయ్యే ఈ చిత్ర తేదీని ప్రత్యేక పోస్టర్‌ ద్వారా రేపు ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బాహుబలి’ రిలీజై రేపటికి 10 ఏళ్లు పూర్తికానుంది. కాగా, ‘బాహుబలి వస్తున్నాడు’ అని తాజాగా మేకర్స్ ట్వీట్ చేయడంతో దీనిపై ఆసక్తి పెరిగింది.

News July 9, 2025

ఆమెకు ఐఫోన్, రూ.లక్షల్లో డబ్బు ఇచ్చా: యశ్

image

తనపై ఆరోపణలు చేస్తున్న యువతికి ఐఫోన్, రూ.లక్షల్లో నగదు అప్పుగా ఇచ్చానని, కానీ ఇప్పటివరకు ఆమె తిరిగి ఇవ్వలేదని RCB బౌలర్ <<16985182>>యశ్ దయాల్ <<>>తెలిపారు. తన కుటుంబసభ్యుల చికిత్స పేరుతోపాటు, షాపింగ్‌కు కూడా తీసుకెళ్లి డబ్బులు కాజేసిందని ఆయన ఆరోపించారు. వీటన్నింటికీ తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. పెళ్లి పేరుతో తనను వాడుకుని వదిలేశాడని యశ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News July 9, 2025

గుర్తుపట్టలేని లుక్‌లో స్టార్ హీరో

image

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న కొత్త మూవీ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. తాజాగా ఈ సినిమాలో శివరాజ్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చేతిలో గన్ పట్టుకుని సీరియస్‌గా చూస్తున్న ఫొటోలో ఆయన గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వైశాక్ నిర్మిస్తున్నారు.

News July 9, 2025

బాబు గాడిదలు కాస్తున్నారా?: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ‘కేజీ మామిడి రెండు రూపాయలా? ఇదేం దారుణం. మా ప్రభుత్వ హయాంలో రూ.22-29కి కొన్నాం. కర్ణాటకలో రూ.16 ఇచ్చి కేంద్రమే కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో బాబు గాడిదలు కాస్తున్నారా? మామిడికి కనీసం రూ.12 కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు’ అని బంగారుపాళ్యం పర్యటనలో ఫైరయ్యారు.

News July 9, 2025

యూట్యూబ్ కొత్త రూల్స్.. ఎప్పటినుంచంటే?

image

యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాన్ని ఈనెల 15వ తేదీ నుంచి కఠినతరం చేయనుంది. ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, రీయూజ్డ్ కంటెంట్‌ను తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. AI వీడియోలు, కాపీపేస్ట్ కంటెంట్, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తే ఛానళ్లు డీమానిటైజ్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కంటెంట్‌తో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పాటించాలని పేర్కొంది.

News July 9, 2025

టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్-10లోకి భారత కెప్టెన్

image

మెన్స్ క్రికెట్ టెస్ట్ ర్యాంకులను ICC ప్రకటించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నం.1 స్థానంలో నిలవగా మరో బ్యాటర్ రూట్ ఓ స్థానం దిగజారి నం.2లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్ జైస్వాల్ నాలుగో స్థానంలో, కెప్టెన్ గిల్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచారు. వికెట్ కీపర్ పంత్ ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో ఉన్నారు. అటు టెస్టుల్లో ఆస్ట్రేలియా, వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియా తొలి స్థానంలో ఉన్నాయి.

News July 9, 2025

‘శబరి’ రైలు ఇక సూపర్‌‌ఫాస్ట్

image

సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మ.2.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు సా.6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ.6.45కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.

News July 9, 2025

గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు: UAE

image

తాము ప్రవేశపెట్టబోయే <<16986034>>గోల్డెన్ వీసాపై<<>> వస్తున్న రూమర్లను ఎవరూ నమ్మొద్దని UAE తెలిపింది. దీనిపై ఎలాంటి థర్డ్ పార్టీ సంస్థకు హక్కులు ఇవ్వలేదని, తమ దేశ అధికారిక సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మధ్యవర్తులను సంప్రదించవద్దని కోరింది. ఈ విషయంలో ఎవరైనా మోసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు 600522222ను సంప్రదించాలని సూచించింది.

News July 9, 2025

ఇవాళ భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

image

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి లిస్ట్ కోసం <>క్లిక్<<>> చేయండి.