News October 2, 2024

ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్రులే!

image

ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్ర దేశాలే. ఈ రెండూ కలిసి మరో దేశంపై యుద్ధం కూడా చేశాయి. ఇరాక్‌పై దాదాపు దశాబ్దంపాటు కలిసి పోరాటం చేశాయి. 1958 నుంచి 1990 వరకు ఈ రెండు దేశాలు కవలలుగా కొనసాగాయి. అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్‌కు రహస్యంగా యుద్ధ విమానాల టైర్లను ఇజ్రాయెల్ సరఫరా చేసింది. కానీ 1990 తర్వాత ఇరాక్ ముప్పు తొలగటం, అరబ్ సోషలిజం రావడం, హెజ్బొల్లా, హమాస్‌తో గొడవల వల్ల బద్ధ శత్రువులుగా మారాయి.

News October 2, 2024

రూ.83వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

image

ఝార్ఖండ్‌లోని హజరీభాగ్‌లో రూ.83,300కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కాగా గత 17 రోజుల్లో ప్రధాని మోదీ ఝార్ఖండ్‌ను సందర్శించడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 15న జంషెడ్‌పూర్‌లో ఆయన పర్యటించారు. అప్పుడు కూడా రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. PM ఆవాస్ యోజన కింద వేలాది మంది పేదలు పక్కా ఇళ్లు పొందగలిగారని ప్రధాని అన్నారు.

News October 2, 2024

కుమారుడు అగస్త్యతో కలిసి హార్దిక్ ప్రాక్టీస్

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన కుమారుడు అగస్త్యతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తండ్రీ కుమారుల అనుబంధాన్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా హార్దిక్, నటాషా విడాకుల అనంతరం కృనాల్ పాండ్య భార్య పాంఖురి శర్మ వద్దే అగస్త్య ఉంటున్నారు. తన కుమారుడు కవిర్‌తోపాటు అగస్త్య బాధ్యతలు కూడా ఆమే చూసుకుంటున్నారు.

News October 2, 2024

ఓవర్సీస్‌లో ‘దేవర’ కలెక్షన్ల సునామీ!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే యూఎస్ మార్కెట్‌లో $5.5 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇటు ఆస్ట్రేలియాలోనూ $850K మార్క్‌ను క్రాస్ చేసినట్లు యువసుధా ఆర్ట్స్ ప్రకటించింది. ఈరోజు హాలీడే కావడంతో భారీగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

News October 2, 2024

ఘోరం.. కూతురిని కరిచిందని కుక్కను దారుణంగా చంపాడు!

image

మధ్యప్రదేశ్‌లోని గుణాలో దారుణం జరిగింది. తన కూతురిపై దాడి చేసిందని వీధికుక్కను ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడు. పప్పు అనే వ్యక్తి ప్రతీకారంగా వీధికుక్కను కర్రలతో కొట్టాడు. ఆపై దానిపై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి నయాపురా వీధుల్లో ఈడ్చుకెళ్లాడు. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

News October 2, 2024

పెరిగిన బంగారం ధరలు

image

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.540 పెరిగి రూ.77,450కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 పెరిగి రూ.71,000గా ఉంది. అటు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.95వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News October 2, 2024

సంయమనం పాటించండి: పశ్చిమాసియాకు భారత్ సూచన

image

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత్ స్పందించింది. చేజారుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు మరింత ఉగ్రరూపం దాల్చకూడదని అభిప్రాయపడింది. సమస్యల్ని చర్చలు, దౌత్య విధానాల్లో పరిష్కరించుకోవాలని సూచించింది. హెజ్బొల్లా చీఫ్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ నిన్న 200 క్షిపణుల్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే.

News October 2, 2024

పురందీశ్వరికి ఇంగిత జ్ఞానం లేదు: VSR

image

AP: బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి ఇంగితజ్ఞానం లేకుండా కోర్టులు, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టుదే మొత్తం తప్పు అని తేల్చేశారు. చంద్రబాబు ఏదైనా మాట్లాడవచ్చట. ఆమెది ‘బావా‘తీతమైన ఆవేదన అనుకోవాలా? తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజీ ఎవరూ చేయలేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News October 2, 2024

DANGER: కూల్‌డ్రింక్స్, కాఫీ, రెడీమేడ్ జ్యూస్‌లతో పక్షవాతం!

image

కూల్ డ్రింక్స్, రెడీమేడ్ జ్యూస్‌లతో పక్షవాతం బారిన పడే ముప్పు ఉందని పరిశోధనలో తేలింది. వీటిలో ఉండే అదనపు చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు పక్షవాతానికి దారి తీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్‌లు, రోజుకి 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే పక్షవాతం ముప్పు 37% పెరుగుతుందని తెలిపారు. బ్లాక్ టీ, రోజుకి ఏడు కప్పుల కన్నా ఎక్కువ నీరు తాగడం పక్షవాతం ముప్పును తగ్గిస్తాయని పేర్కొన్నారు.

News October 2, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది.