India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ ఒక రఫేల్ ఫైటర్ జెట్‌ను కోల్పోయిందని ఆ జెట్‌ల తయారీ సంస్థ ‘దసో ఏవియేషన్’ సీఈవో ఎరిక్ ట్రాపియర్ వెల్లడించారు. అయితే శత్రువుల (పాకిస్థాన్) దాడి వల్ల అది నేలకూలలేదని, టెక్నికల్ ఫెయిల్యూర్ వల్లే కూలిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా రఫేల్ కూలిపోయినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. అటు 6 రఫేల్ విమానాలను కూల్చేసినట్లు పాకిస్థాన్ ప్రచారం చేస్తోంది.
నేడు ‘భారత్ బంద్’ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. బంద్‌కు మద్దతుపై ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అటు విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటిస్తాయి. కానీ ఇవాళ కార్మిక సంఘాలు మాత్రమే బంద్‌లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లు సైతం తెరిచే ఉండనున్నాయి. బంద్ ఉంటుందని తల్లిదండ్రులకు సైతం మెసేజ్ రాలేదు.
AP: MBA/MCA ప్రవేశాల కోసం నిర్వహించే ICET తొలి విడత కౌన్సెలింగ్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవచ్చని, 13 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. సీట్లు పొందిన విద్యార్థుల సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.
ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర 2026కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇంటర్నేషనల్ పాస్ పోర్టును కలిగి ఉండటం తప్పనిసరని పేర్కొంది. యాత్రికులు hajcommittee.gov.in లేదా HAJ SUVIDHA మొబైల్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరణం, ఎమర్జెన్సీ మినహాయించి యాత్రను క్యాన్సిల్ చేసుకుంటే జరిమానా తప్పదని స్పష్టం చేసింది.
AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చించనుంది. అమరావతికి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వనుంది.
ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు మాంచెస్టర్‌లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. 2-1తో లీడింగ్‌లో ఉన్న టీమ్ ఇండియా సిరీస్‌పై కన్నేసింది. షెఫాలీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కు ప్లస్. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.
AP: రేపు మరో 9.51 లక్షలమంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బు జమ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించగా 1.34 లక్షల మంది అర్హులుగా తేలారు. వారికీ రేపు నగదు జమ చేయనున్నారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PPT) ఇవ్వనుంది. ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఇటీవల పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై PPT ఇవ్వగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర వివరాలు తెలియజేయనున్నారు. BRS హయాంలో కృష్ణా జలాల లెక్కలను మంత్రి వివరించనున్నారు.
TG: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇచ్చిన 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ <<16856622>>పోస్టులకు<<>> అదనంగా మరో 704 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీల్లో టీచింగ్ సమస్యలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అటు 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతి కల్పించింది. 278 అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇవ్వనుంది.
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నిన్న మరోసారి క్లారిటీ ఇచ్చారు. AUG 15 నుంచి ఈ స్కీమ్ ప్రారంభం అవుతుందని, ఇది కేవలం జిల్లాకే పరిమితమని స్పష్టం చేశారు. దీంతో ఒక జిల్లా మహిళలు మరో జిల్లాకు వెళ్లాలంటే సొంత జిల్లా సరిహద్దు వరకే ఉచితంగా వెళ్లొచ్చు. జిల్లా దాటితే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అటు తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించే సౌకర్యం ఉంది. మరి సీఎం నిర్ణయంపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.