News July 9, 2025

నేడు భారత్ బంద్.. ఈ రంగాలపై ప్రభావం!

image

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్ ప్రభావం పరిశ్రమలు, పోస్టల్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ ప్రజా రవాణా, ప్రభుత్వరంగ సంస్థలపై ఉండనుంది. సహకార బ్యాంకులు పనిచేయకపోయినా ప్రైవేటు బ్యాంకులు పని చేయొచ్చు. విద్యాసంస్థలు, ప్రైవేటు ఆఫీసులు యథావిధిగా నడిచే అవకాశం ఉంది. రవాణా విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

News July 9, 2025

EP-2: స్త్రీలో ఈ లక్షణాలు ప్రమాదం: చాణక్య నీతి

image

వ్యక్తుల గుణగణాలపై చాణక్య నీతిలో చెప్పిన మాటలు ఇవాళ్టికీ ఆమోదయోగ్యంగానే అనిపిస్తాయి. స్త్రీలో ఈ లక్షణాలుంటే కుటుంబానికి మంచి జరగదని చాణక్యుడు పేర్కొన్నారు. అవసరానికి మించి ఖర్చులు చేయడం, చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, డబ్బు/అందం గురించి గర్వ పడటం, భర్త ఆదాయాన్ని తక్కువ చేయడం. ఈ లక్షణాలు కుటుంబ మానసిక, ఆర్థిక పరిస్థితులకు మంచిది కాదని తెలిపారు.
<<-se>>#chanakyaneeti<<>>

News July 9, 2025

గిల్ కెప్టెన్సీకి 10కి 10 మార్కులు: రవిశాస్త్రి

image

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్.. డాన్ బ్రాడ్‌మన్‌లా బ్యాటింగ్ చేశారని టీమ్ ఇండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కొనియాడారు. ‘రెండో టెస్టులో గిల్ కెప్టెన్సీకి 10కి 10 మార్కులిస్తాను. విదేశాల్లో ఒక భారత కెప్టెన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఆకాశ్‌ లాంటి సీమర్‌ను తీసుకున్న అతని నిర్ణయాన్ని మెచ్చుకోవాలి. అక్కడి పరిస్థితులకు ఆకాశ్ సరైన ఎంపిక. అతను సిరీస్ మొత్తం ENG బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు’ అని తెలిపారు.

News July 9, 2025

డోపింగ్‌ టెస్టులో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్

image

భారత టాప్ హెవీవెయిట్ రెజ్లర్‌ రితికాహుడా డ్రగ్ వాడినట్లు డోపింగ్ టెస్ట్‌లో తేలింది. ఆసియా ఛాంపియన్‌షిప్ ముందు మార్చి 15న చేసిన టెస్టులో.. ఆమె మూత్రంలో నిషేధిత S1 అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్‌ గుర్తించారు. దాంతో జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ ఏడాది నిషేధం విధించింది. రితికా తాను తప్పుచేయలేదని, విచారణకు సహకరిస్తానన్నారు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌(2025 Sep)వేళ ఆమెపై భారత్ ఆశలు పెట్టుకుంది.

News July 9, 2025

గోల్డ్‌మన్ శాక్స్ సీనియర్ అడ్వైజర్‌గా రిషి సునాక్

image

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ గోల్డ్‌మన్‌ శాక్స్‌లో చేరినట్లు ఆ సంస్థ ప్రకటించింది. సీనియర్ అడ్వైజర్‌గా క్లయింట్స్‌కు మ్యాక్రోఎకనామిక్, జియో పొలిటికల్ వ్యవహారాల్లో సలహాలిస్తారు. 2001-2004 వరకు రిషి సునాక్ ఇదే సంస్థలో అనలిస్ట్‌గా ఉన్నారు. 2015, 17, 19లో రిచ్‌మండ్&నార్తల్లెర్టన్ MPగా గెలిచారు. బోరిస్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న ఆయన.. ప్రధానిగా ఎన్నికై OCT 2022-జులై 2024 వరకు సేవలందించారు.

News July 9, 2025

అమర్‌నాథ్ యాత్రకు 6 రోజుల్లోనే లక్షమంది

image

ఈనెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. గతేడాది 52 రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ఈసారి మాత్రం 38 రోజులు మాత్రమే కొనసాగనుంది. రెండు మార్గాల్లోనూ యాత్ర సజావుగా సాగుతోంది. ఈసారి మొత్తం 5 లక్షల వరకు భక్తులు యాత్రలో పాల్గొంటారని ఆలయ బోర్డు భావిస్తోంది.

News July 9, 2025

బ్రెజిల్ అధ్యక్షుడు, ప్రజలకు కృతజ్ఞతలు: మోదీ

image

బ్రెజిల్ నుంచి అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ అవార్డు అందుకోవడంపై అధ్యక్షుడు లూలా, బ్రెజిల్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశ ప్రజల పట్ల బ్రెజిల్ ప్రజలకు ఉన్న బలమైన అభిమానాన్ని వివరిస్తుంది అన్నారు. రాబోయేకాలంలో ఇరు దేశాల స్నేహం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

News July 9, 2025

జులై 9: చరిత్రలో ఈరోజు

image

1875: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపన
1926: దివంగత మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జననం
1927: దివంగత నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం(ఫొటోలో)
1930: దివంగత దర్శకుడు కె. బాలచందర్ జననం (ఫొటోలో)
1949: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావం
1966: గాయకుడు ఉన్నికృష్ణన్ జననం
1969: ‘పులి’ భారత జాతీయ జంతువుగా ప్రకటన
1969: మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు జననం

News July 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 9, 2025

విశాఖలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ క్యాంపస్

image

AP: రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. బెంగళూరులో మంత్రి లోకేశ్ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తర్వాత ఆసంస్థ 30ఎకరాల్లో రూ.1500 కోట్లతో వాంటేజ్ మిక్స్డ్ డెవలప్మెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ తెలిపారు. ANSR సంస్థ కూడా విశాఖలో GCC ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU చేసుకుంది.