News July 8, 2025

పెట్టుబడులకు అనుమతుల్లో జాప్యం ఉండదు: CBN

image

AP: అమరావతిలో పెట్టుబడులకు అనుమతుల మంజూరులో జాప్యం ఉండదని CM CBN స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నిర్మాణాలపై యజమానులతో సమావేశమయ్యారు. వ్యాపార, విద్యాసంస్థలు, ఆఫీస్‌లకు ఇచ్చిన స్థలాల్లోని పరిస్థితిని తెలుసుకున్నారు. 72 సంస్థలకు 947 ఎకరాలను CRDA కేటాయించిందని తెలిపారు. అనుమతుల మంజూరులో సమస్యలుంటే తనను సంప్రదించాలని పెట్టుబడిదారులకు సూచించారు.

News July 8, 2025

సీఎంఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల

image

కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్(CMA) ఫౌండేషన్ పరీక్షల <>ఫలితాలను<<>> ICMAI విడుదల చేసింది. టాప్-10 ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. తొలి 2 ర్యాంకులు రియా పొద్దార్(బెంగాల్), అక్షత్(గుజరాత్) సాధించగా, తర్వాతి ర్యాంకుల్లో విశాఖకు చెందిన మోహిత్ దాస్(3), గుంటూరుకు చెందిన సాయి రాఘవేంద్ర రెడ్డి (4), గాయత్రి శ్రావ్య(5), మైత్రిక(6), బండిరెడ్డి మహేశ్వర్(6), హైదరాబాద్‌కు చెందిన సాయి విశ్వనాథ్ (7), హర్షిత (7) నిలిచారు.

News July 8, 2025

బికినీలో స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బీచ్ వద్ద బికినీలో ఉన్న ఫొటోలను కరీనా ఇన్‌స్టాలో షేర్ చేశారు. షూటింగ్ కోసమా లేదా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లారా అనేది వెల్లడించలేదు. కాగా 44 ఏళ్ల వయసులో ఆమె ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

News July 8, 2025

ఈ నెల 13 వరకే ఫిర్యాదులకు అవకాశం

image

AP: అన్నదాత సుఖీభవ-PM కిసాన్‌కు సంబంధించి అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జాబితాలో పేరు లేనివారు రైతు సేవా కేంద్రంలో అర్జీలు అందజేయొచ్చని, అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యూల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అందుకు ఈ నెల 13వరకే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ పథకం కింద ఈ నెలలోనే రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

News July 8, 2025

అవి సేఫ్.. వెయ్యికి పైగా విమానాలున్నాయి: ఎయిరిండియా

image

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మోడల్ విమానం సురక్షితమైందేనని ఎయిరిండియా తెలిపింది. పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మోడల్ ఎయిర్‌‌క్రాఫ్ట్స్ వెయ్యికి పైగా సేవలందిస్తున్నాయన్నారు. అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్‌లో ఎయిరిండియా CEO విల్సన్, DGCA, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News July 8, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడగా, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం కనిపించింది. నేడు మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండిందో కామెంట్ చేయండి.

News July 8, 2025

‘కన్నప్ప’ తీయడం పూర్వజన్మ సుకృతం: మోహన్‌బాబు

image

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర నిర్మాత మోహన్‌బాబు అన్నారు. ఇవాళ అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి విజయవాడలో మూవీని ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ తీయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. మన సంస్కృతి, చరిత్రను పిల్లలకు తెలియజేయాలనే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.

News July 8, 2025

15ఏళ్లు ముందుగానే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి!

image

అందరిలా 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలని అనుకునేవారికి ప్రముఖ సీఏ కానన్ బహ్ల్ లింక్డ్ఇన్‌లో పలు సూచనలు చేశారు. పెరుగుతున్న ఖర్చులు, జీవనశైలి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం 45 ఏళ్లకే రిటైర్ అవుతారని, అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ‘ఫ్యూచర్ గురించి ఆలోచించి పొదుపును పెంచాలి. EPF & NPSలలో ఇన్వెస్ట్ చేయండి. ఇవి మీ డబ్బును ఎక్కువ కాలం బ్లాక్ చేసి దుర్వినియోగం చేయకుండా చూస్తాయి’ అని తెలిపారు.

News July 8, 2025

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో మరో 20వేల ఎకరాల భూసమీకరణ, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

News July 8, 2025

ఈనెల 16న ఆమెకు మరణశిక్ష అమలు!

image

యెమెన్‌లో వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు ఈనెల 16న అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేయనుంది. 2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఈ కేసులో అరెస్టైన ఆమెకు మరణశిక్ష పడింది.