News July 8, 2025

ఆమెతో ఇప్పటికే పెళ్లయిపోయింది: ఆమిర్ ఖాన్

image

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, ఆమెతో ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా బంధం పట్ల గౌరీ, నేనూ సీరియస్‌గా ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములమయ్యాం. ఇక పెళ్లి గురించి అంటారా.. నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నా. అధికారికంగా ఎప్పుడు ప్రకటించాలో త్వరలో నిర్ణయించుకుంటాం’ అని తెలిపారు.

News July 8, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 8, 2025

US కొత్త చట్టం.. పెరగనున్న వీసా ఫీజులు

image

US ప్రెసిడెంట్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్‌’తో వీసా ఫీజులు పెరగనున్నాయి. నాన్ ఇమిగ్రెంట్లు తప్పనిసరిగా వీసా జారీ సమయంలో ఇంటిగ్రిటీ ఫీజు కింద $250 చెల్లించాలి. భవిష్యత్ నిబంధనలకు అనుగుణంగా ఇది పెరగొచ్చు. 2026 నుంచి కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ మొత్తం ఏటా పెరుగుతూ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం లేదా రద్దు చేయడానికి వీలుండదు.

News July 8, 2025

‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు

image

2026-27 విద్యాసంవత్సరానికి 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి పూర్తయినవారు, ఈ ఏడాది అదే క్లాసు చదువుతున్నవారు అర్హులు. AP, TG సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. cbseitms.rcil.gov.in/nvs వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News July 8, 2025

18 రోజుల్లో కుబేర కలెక్షన్లు ఎంతంటే?

image

నాగార్జున, ధనుష్, రష్మిక కాంబోలో వచ్చిన ‘కుబేర’ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. గత నెల 20న రిలీజైన ఈ మూవీ వారంలోనే రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీం ప్రకటించింది. ఆ తర్వాత పలు సినిమాలు రిలీజ్ కావడంతో కలెక్షన్లు తగ్గాయి. సినిమా రిలీజై నేటికి 18 రోజులు కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.134.25 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

News July 8, 2025

CBSE: సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల

image

10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను CBSE రిలీజ్ చేసింది. ప్రైవేట్ విద్యార్థులు వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. రెగ్యులర్ స్టూడెంట్స్ తమ స్కూళ్లలో హాల్‌ టికెట్లు కలెక్ట్ చేసుకోవాలని పేర్కొంది. కాగా ఈనెల 15 నుంచి 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. 10 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.

News July 8, 2025

TTD ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్

image

AP: TTDలో పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) రాజశేఖర్ బాబు సస్పెండ్ అయ్యారు. తిరుపతి(D)లోని స్వగ్రామం పుత్తూరులో ఆయన ప్రతి ఆదివారం చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని TTDకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన TTD విజిలెన్స్ అధికారులు రాజశేఖర్ ఆలయ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని గుర్తించారు. ఇతర ఆధారాలూ పరిశీలించిన ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేశారు.

News July 8, 2025

DEECET అభ్యర్థులకు అలర్ట్

image

AP: డైట్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన DEECETకు సంబంధించి అభ్యర్థులు ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. ఈనెల 13 నుంచి 16 వరకు సీట్ అలాట్‌మెంట్స్, 17 నుంచి 22 వరకు DIET కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటాయని పేర్కొంది. 25న తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.

News July 8, 2025

టెస్టుల్లో కొనసాగుతున్న సౌతాఫ్రికా జోరు

image

ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(WTC) గెలిచిన సౌతాఫ్రికా టెస్టుల్లో తన జోరు కొనసాగిస్తోంది. తాజాగా జింబాబ్వేను రెండో టెస్టులో చిత్తు చేసి వరుసగా 10వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ముల్డర్(367*) విజృంభణతో 626-5 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 170 రన్స్‌కి ఆలౌటైన జింబాబ్వే ఫాలోఆన్‌లో 220కే పరిమితమైంది. దీంతో ఇన్నింగ్స్ 236 రన్స్ తేడాతో SA భారీ విక్టరీ నమోదు చేసింది.

News July 8, 2025

రేపు హాల్‌టికెట్లు విడుదల

image

AP: రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆయా పరీక్షలు ఈనెల 15 నుంచి 23 వరకు జరగనున్నాయి.