India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: MLA ప్రశాంతిరెడ్డిపై YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైరయ్యారు. వ్యక్తిత్వాన్ని కించపరస్తూ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ‘YCP నేతలకు మహిళలంటే ఇంత ద్వేషభావమా? తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ గారిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మహిళల జోలికి వస్తే ఊరుకునేందుకు ఇది జగన్ గారి జంగిల్ రాజ్ కాదు.. మహిళలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం’ అని వ్యాఖ్యానించారు.
TG: CM రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీలో భాగ్యనగర ఇబ్బందులు లేకుండా నిపుణులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత MGBS-చాంద్రాయణగుట్ట మెట్రో రూట్‌ను అక్కడి నుంచి ఫోర్త్ సిటీకి విస్తరించే పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇక కొత్త నగరంలో స్పోర్ట్స్ హబ్ ఉంటుందని CM ఇప్పటికే ప్రకటించగా, ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద స్టేడియాన్ని ఇక్కడ నిర్మిస్తారని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.
TG: తమకున్న అనుభవాల ముందు KTR జీరో అని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్. KTR సెకండ్ బెంచ్ స్టూడెంట్. తన తండ్రి ఎమ్మెల్యే సీటు ఇస్తే డైరెక్ట్‌గా గెలిచారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మమ్మల్ని అంటే పది మాటలు అంటాం. అనడం మానేస్తే మేమూ మానేస్తాం’ అని స్పష్టం చేశారు.
* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా పరిధిలోనే అని CM చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
* విశాఖలో ఇన్నోవేషన్ క్యాంపస్ స్థాపనకు ANSR సంస్థతో ఒప్పందం కుదిరిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో 10 వేలమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
* YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డిపై MLA ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* ప్రపంచంలోనే AP లిక్కర్ స్కాం అతిపెద్ద కుంభకోణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
షుగర్ కంటే దాదాపు 300రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉండే మొక్క ఒకటుంది. అదే ‘స్టీవియా రెబౌడియానా’. దీని ఆకుల నుంచి స్టీవియాను(స్వీట్నర్) తీస్తారు. ‘స్వీట్ లీఫ్’ అని పిలిచే వీటి ఆకులలో స్టీవియోసైడ్ & రెబౌడియోసైడ్ వంటి సమ్మేళనాలు అధిక తీపిని కలిగి ఉంటాయి. ఇందులో కేలరీలు ఉండవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. షుగర్ ఫ్రీ ఉత్పత్తుల్లో దీనిని వాడుతుంటారు. నర్సరీ/ఆన్‌లైన్‌లో లభించే వీటిని ఇళ్లలోనూ పెంచుకోవచ్చు.
TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో ప్రమాదానికి నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని NDMA బృందం తేల్చింది. ఇవాళ ఘటనా స్థలంలో పరిశీలన చేపట్టిన బృంద సభ్యులు పేలుడుకు గల కారణాలపై అధ్యయనం చేశారు. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది మరణించిన విషయం తెలిసిందే. ఘటన జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాలు ఆర్జించాయి. Sensex 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 25,522 వద్ద స్థిరపడింది. కోటక్ మహీంద్రా, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, NTPC, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, SBI, విప్రో షేర్లు లాభపడగా.. టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి షేర్లు నష్టపోయాయి.
TG CM రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. తాజాగా ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరతపై చర్చించారు. ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని, మరో 3 లక్షల టన్నులు రావాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా యూరియాతో పాటు ఎరువులు సరఫరా చేయాలని కోరారు. కొద్దిసేపట్లో పీయూష్ గోయల్‌తోనూ సీఎం రేవంత్ సమావేశం కానున్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు (జులై 9) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, బీమా, పోస్టల్, విద్యుత్ తదితర రంగాలపై బంద్ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటనలు రాలేదు. ఇవాళ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశముంది. రవాణా అంతరాయం, నిరసనల కారణంగా కొన్ని స్కూల్స్, కాలేజీల కార్యకలాపాలకు ఆటంకం కలిగే ఆస్కారం ఉంది.
ఇంగ్లండ్‌తో ఎల్లుండి ప్రారంభం కానున్న మూడో టెస్టుకు స్టార్ బౌలర్ సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడో టెస్టుకు మధ్యలో మూడు రోజులే గ్యాప్ వచ్చింది. దీంతో తొలి టెస్టులో 41 ఓవర్లు, రెండో దాంట్లో 32 ఓవర్లు వేసిన సిరాజ్‌పై వర్క్‌లోడ్ పడొద్దని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే అతని స్థానంలో బుమ్రాను తీసుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.