India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామని డిప్యూటీ CM పవన్ వెల్లడించారు. ఇందుకోసం కేంద్రం ఇచ్చిన జల జీవన్ మిషన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ’75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ప్రజలకు ఇంకా సురక్షిత నీరు అందకపోవడం చాలా బాధాకరం. తిరువూరు, ఉద్దానం, కనిగిరి, ఉదయగిరి సహా మరిన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇచ్చేలా RO ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు.
TG: సీఎం రేవంత్ నేడు వేములవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవులు ఇచ్చాయంటూ BRS తప్పుబట్టింది. స్కూల్ బస్సులను సీఎం సభ కోసం కేటాయించామని, దీంతో ఈ రోజు స్కూళ్లకు హాలిడే ప్రకటిస్తున్నట్లు పిల్లల పేరెంట్స్‌కు వాట్సాప్‌లో మెసేజ్లు వచ్చినట్లు పేర్కొంది. అయితే దీనికి బదులుగా Dec 14న(రెండో శనివారం) వర్కింగ్ డేగా ఉంటుందని DEO చెప్పినట్లు ఆ మెసేజ్లో ఉంది.
తనపై వచ్చిన <<14658660>>బిట్‌కాయిన్ స్కామ్<<>> ఆరోపణలన్నీ అవాస్తవాలేనని NCP SP నేత సుప్రియా సూలె అన్నారు. పోలింగ్ వేళ BJP కుట్ర రాజకీయాలకు తెరతీసిందని విమర్శించారు. ‘BJP నేతలెవరితోనైనా, ఎప్పుడైనా దీనిపై చర్చకు నేను సిద్ధం. పోలింగుకు ముందు రాత్రి ఆ పార్టీ అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. సుదాన్షు త్రివేది ఆరోపణలన్నీ అవాస్తవాలే. మా లాయర్ ఆయనపై క్రిమినల్, సివిల్ పరువునష్టం దావా వేస్తారు’ అని అన్నారు.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక విషయాలపై మాట్లాడతారని తెలుస్తోంది. పోలవరం, రుషికొండ వంటి పలు అంశాలపై ఆయన మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి సర్కార్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు యావత్ పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తెలిపారు. కోహ్లీ తొలిసారి పాక్ గడ్డపై అడుగుపెట్టాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘విరాట్ పాక్ గడ్డపై సెంచరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించలేం. ఇక్కడ ఆడితే ఆయన క్రికెట్ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు చివరి క్షణంలోనైనా భారత్ ఇక్కడికి వస్తుందేమో చూడాలి’ అంటూ పేర్కొన్నారు.
కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌లో కొడుకును రైలు ఎక్కించేందుకు వచ్చిన ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. వందేభారత్ రైలెక్కి కొడుకు సీటు వద్ద లగేజీ పెట్టి దిగుతుండగా డోర్లు క్లోజ్ అయ్యాయి. దీంతో అతను కొడుకుతో కలిసి న్యూఢిల్లీ వరకూ వెళ్లాల్సి వచ్చింది. ఇలా టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకు టీసీ రూ.2870 జరిమానా విధించారు. ఎవరైనా తమవారికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చినప్పుడు వందేభారత్‌లోకి ఎక్కకపోవడమే బెటర్.
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 56 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని హైదరాబాద్‌లోని US కాన్సులేట్ జనరల్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. వీరిలో AP నుంచి 22 శాతం, TG నుంచి 34 శాతం మంది ఉన్నారు. USలో మొత్తం 3.3 లక్షల మంది భారత విద్యార్థులు ఉండగా లక్షన్నరకుపైగా మనవాళ్లే. ప్రస్తుతం రోజుకూ 1,600 వీసాలు జారీ చేస్తున్నారు. అలాగే 8 వేల మంది అమెరికన్లు భారత్‌లో చదువుతున్నారు.
కొందరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఫార్మసీల్లో మందులు కొంటుంటారు. అయితే సరైన అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకుంటే అవి యాంటీబయాటిక్‌లా కాదా అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ యాంటీబయాటిక్ కేటగిరీకి చెందినవైతే వద్దని చెప్పండి. యాంటీబయాటిక్ వాడాలనుకుంటే డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది.
APలో రాష్ట్ర రహదారులను హైవేల్లా అభివృద్ధి చేసేలా ఏజెన్సీలకు అవకాశం కల్పించి, టోల్ వసూలు చేయాలన్న CM చంద్రబాబు ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ఆటోలు, బైకులు, ట్రాక్టర్లకు టోల్ ఉండదు. ఇప్పటికే నేషనల్ హైవేలపై టోల్ పేరుతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని, దీనిపై పునరాలోచించాలని కొందరు అంటున్నారు. మరికొందరేమో రోడ్లు బాగుచేసి, రూ.20-30 టోల్ ఫీజు ఉంటే బాగుంటుందంటున్నారు. సీఎం ప్రతిపాదనపై మీ కామెంట్?
దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. సగటున గంటకు 20 మంది చనిపోయారు. 4.62 లక్షల మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు, గాయాలపాలైన వారి సంఖ్య పెరిగింది. అత్యధికంగా UPలో 23,652 మంది, TNలో 18,347 మంది, MHలో 15,366 మంది చనిపోయారు. అటు అత్యధికంగా TNలో 67,213 ప్రమాదాలు జరిగాయి.
Sorry, no posts matched your criteria.