India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌కు డిగ్రీ కాలేజీల అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం ఇవాళ్టి నుంచి ఈ బంద్ చేపట్టింది. బకాయిలు విడుదలయ్యే వరకు కాలేజీలు తెరిచేది లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. గత నెలలో నాలుగు రోజులు కాలేజీలు బంద్ చేసినప్పుడు, 3-4 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేసింది.
TG: టెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకూ 2,07,765 దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ జి.రమేశ్ వెల్లడించారు. పేపర్-1కు 61,930 మంది, పేపర్-2కు 1,28,730 మంది, రెండు పేపర్లకు 17,104 మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. కాగా ఎడిట్ ఆప్షన్ గడువు ఈనెల 22తో ముగియనుంది. దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు వస్తే 7032901383, 9000756178 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
AP: సీఎం చంద్రబాబు వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయనతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల బృందం నిన్న దావోస్‌కు పయనమైంది.
తమిళ హీరో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ముందు ప్రకటించినట్లుగానే 2025 JAN 10న రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. నేడో రేపో అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలిపాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అదే రోజు రిలీజవుతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు తమిళనాడులో ఈ సినిమా గట్టి పోటీనిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఇప్పటివరకూ 72% పూర్తయింది. నిన్నటి వరకు 83,64,331 ఇళ్లలో సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ములుగులో 98.9% ఇళ్లలో సర్వే పూర్తయింది. ఆ తర్వాతి రెండు స్థానాల్లో నల్గొండ (95%), జనగామ (93.3%) ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యల్పంగా 50.3% ఇళ్లలో కులగణన జరిగింది.
1981లో సరిగ్గా ఇదే రోజు రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక నుంచి భాస్కర –II ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 444KGS బరువు ఉండే ఈ శాటిలైట్ పని చేసే కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పదేళ్లు కక్ష్యలో తిరిగింది. భూ పరిశీలన కోసం ప్రయోగించిన భాస్కర శ్రేణిలో ఇది రెండవ ఉపగ్రహం. గణిత శాస్త్రవేత్త మొదటి భాస్కరుడు గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. దీనికి ముందు 1979లో భాస్కర-I ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.
భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్.రెహమాన్ ట్వీట్ చేశారు. ‘మేము మా బంధంలో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము. అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒక్కటి కాలేకపోవచ్చు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
BGT తొలి టెస్టులో జైస్వాల్‌కు జోడీగా KL రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉందని espncricinfo పేర్కొంది. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో పంత్ ఆడతారని తెలిపింది. ఆరో స్థానం కోసం సర్ఫరాజ్, జురెల్ మధ్య పోటీ ఉందని, ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్, అశ్విన్‌కు చోటు దక్కొచ్చని పేర్కొంది. పేసర్లలో బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, సిరాజ్/ఆకాశ్‌దీప్ ఆడొచ్చని అంచనా వేసింది.
TG: గ్రూప్-3 ప్రశ్న పత్రంలో తక్కువ కులం, ఉన్నత కులం అనే పదాలు వాడారని డా.RS. ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌పై KTR స్పందించారు. ‘TGPSC ఈ రకమైన కులతత్వ ఎజెండాను ప్రోత్సహించడం సిగ్గుచేటు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని అన్నారు. ‘తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇక సామాజిక న్యాయం ఎలా వస్తుంది రేవంత్ గారూ?’ అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.